కేపీహెచ్‌బీ కాలనీ, నవంబర్ 9 : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీత భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్లో ఎమ్మెల్యే కృష్ణారావు పాదయాత్రతో ప్రజలను కలిసి కారు గుర్తుకు ఓటేయ్యాలని కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..మాయా మాటలతో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పెందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలతో పేదలు, మహిళలు,రైతులు, ముస్లీం, క్రిస్టియన్ సోదరులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. గతంలో మాజీ సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, ఎమ్మెల్యేగా గోపినాథ్ చేసిన సేవలను ప్రజలు మరిచిపోలేదన్నారు. ప్రచారంలో ప్రజలంతా బీఆర్‌ఎస్‌కకు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. పేదలను, కార్మికులను, మహిళలను నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధిరావలంటే… జూబ్లీహిల్స్ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ తీర్పు తెలంగాణ భవిష్యత్‌కు గొప్పమలుపు అవుతుందన్నారు. బంగారు భవిష్యత్ కోసం ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని బీఆర్ఎస్ను గెలిపించాలన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ఉన్నారు.