Kunamneni Sambashiva Rao | కాంగ్రెస్ సర్కార్‌లో పేరుకే మంత్రులు.. హాట్ టాపిక్‌గా సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని కామెంట్స్
MLA Kunamneni Sambashiva Rao | కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు పేరుకే ఉన్నారని.. మంత్రులేమో మంజూరు చేస్తారు.. కానీ వారికి డబ్బులు విడుదల చేసే అధికారం లేదని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు.
MLA Kunamneni Sambashiva Rao | కాంగ్రెస్ సర్కార్ పని తీరు ఎలా ఉందో మరోసారి తెలియజేసేలా సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన కామెంట్స్ హాట్ టాపిక్‌గా మారాయి. మీడియా సమావేశంలో కూనంనేని మాట్లాడుతూ.. బడ్జెట్లో కేటాయింపులు జరిగితే వ్యవసాయ రంగానికి రూ.10 వేల కోట్లు, ఇరిగేషన్‌కు రూ.10 వేల కోట్లు, ఆర్‌అండ్‌బీకి రూ.10 వేల కోట్లు, మైనార్టీకి రూ.10 వేల కోట్లు అని ప్రకటించిన తర్వాత నువ్వు ఎంతైనా ఇవ్వు.. కేటాయించే అధికారం ఆ మంత్రి పరిధిలో ఉండాలి.. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులు పేరుకే ఉన్నారని ఎద్దేవా చేశారు.
మంత్రులేమో మంజూరు చేస్తారు.. కానీ వారికి డబ్బులు విడుదల చేసే అధికారం లేదు. మంజూరు చేసేందుకు మళ్లీ వాళ్లు ఆర్థిక శాఖ మంత్రి చుట్టూ తిరగాల్సి వస్తుంది. అంటే ఈ మంత్రులు కూడా వాళ్ల దగ్గరకు వెళ్లాల్సి వస్తుంది. మంత్రులు పేరుకే.. వారంతా ఆర్థిక శాఖ మంత్రి చుట్టూ తిరగాల్సి వస్తుందన్నారు.
మేం తిరిగినట్టుగా.. వాళ్ల డబ్బులు.. వాళ్ల శాఖ డబ్బులు.. ఒక్క పని అవడం లేదు. ఒక్క కాంట్రాక్టర్ ముందుకు రావడం లేదు. ఎవరూ ముందుకు రావడం లేదు..ఉన్న డబ్బులు కొద్దికొద్దిగా ఇస్తుర్రా అంటే లేదు.. అదేమంటే డబ్బుల్లేవంటారు.. డబ్బుల్లేవన్నప్పుడు బడ్జెట్ ఎందుకు పెట్టారు.. ఎంతో కొంత ఉంది కదా.. నీ ప్రాధాన్యతలేంటి..? ఆ డబ్బులు వీటికివ్వడం లేదు.. మీ ప్రాధాన్యతలు ఎక్కడో ఉన్నయంటూ ఆరోపించారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో పేరుకే మంత్రులు
మంత్రులకు వాళ్ల శాఖ డబ్బులు సాంక్షన్ చేసే అధికారం లేదు.. సాంక్షన్ కోసం వాళ్లు మళ్లీ ఆర్థిక శాఖ మంత్రి చుట్టూ తిరగాల్సి వస్తుంది
దీని వల్ల ఒక్క పని కూడా కావడం లేదు.. ఒక్క కాంట్రాక్టర్ కూడా ముందుకు రావడం లేదు
ఏమైనా అంటే డబ్బులు లేవు… pic.twitter.com/41zp0mGEfC
— Telugu Scribe (@TeluguScribe) August 31, 2026
Read Also :
Novak Djokovic: తొలి రౌండ్లోనే ఓడిన మాజీ చాంపియన్.. యూఎస్ ఓపెన్‌లో ఏడ్చిన జోకోవిచ్
Kiran Abbavaram | పిల్లితో మొదలైన మిస్టరీ.. ‘హతః’ టైటిల్ గ్లింప్స్‌తో ఆసక్తి పెంచిన కిరణ్ అబ్బవరం!
SP Mahesh B Githe | రాజన్న సిరిసిల్ల జిల్లాలో పోలీస్ యాక్ట్ అమలు.. ఎస్పీ మహేష్ బి.గితే
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్‌కు మరణశిక్ష
Mythri Movie Makers | నైజాంలో మైత్రీ మూవీ మేకర్స్ హవా.. దసరా బరిలో కీలక సినిమాల పంపిణీ బాధ్యతలు ఆ సంస్థకే!
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

