న్యూయార్క్: టెన్నిస్ లెజెండ్ నోవాక్ జోకోవిచ్(Novak Djokovic) ఏడ్చేశాడు. యూఎస్ ఓపెన్ తొలి రౌండ్లోనే ఓడిన అతను.. చివరి సెట్లో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఓడిపోతున్నానన్న భావోద్వేగాన్ని అతను ఆపుకోలేకపోయాడు. సెర్టియా స్టార్ జోకోవిచ్ 7-6 (5), 5-7, 4-6, 6-2, 6-1 స్కోరుతో అర్జెంటీనా ప్లేయర్ మారియానో నవోని చేతిలో ఓటమి పాలయ్యాడు. 24 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు గెలిచిన జోకోవిచ్ 39 ఏళ్ల వయసులో గట్టి పోటీ ఇచ్చాడు. చివర వరకు ఫస్ట్ రౌండ్‌ను గట్టెక్కేందుకు ప్రయత్నించాడు. కానీ అతను ప్రయత్నం సఫలం కాలేదు. ఓ దశలో అతను తన టవల్లో కక్కేశాడు. నాలుగవ సీడ్ జోకోవిచ్.. తొలి సారి యూఎస్ ఓపెన్‌లో ఫస్ట్ రౌండ్లోనే నిష్క్రమించాడు.
2006 తర్వాత గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో అతను తొలి రౌండ్లో ఓడిపోవడం ఇదే మొదటిసారి. మ్యాచ్ ఓడిన తర్వాత మాట్లాడుతూ ఆ ఫీలింగ్‌ను తట్టుకోలేకపోయినట్లు చెప్పాడు. వాస్తవానికి ఈ సారి యూఎస్ ఓపెన్‌లో టైటిల్ గెలిచేందుకు జోకోవిచ్‌కు మంచి అవకాశం ఉండే. వరల్డ్ నెంబర్ వన్ జాన్నిక్ సిన్నర్ గాయం వల్ల ఆడడం లేదు. ఇక డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్ చాలా గ్యాప్ తర్వాత మళ్లీ గ్రౌండ్లోకి దిగాడు.
జోకోవిచ్, నవోని మ్యాచ్ సుమారు 4 గంటల 36 నిమిషాల పాటు సాగింది. జోకోవిచ్ కెరీర్లో ఇదే అత్యధిక సమయం తీసుకున్న తొలి రౌండ్ మ్యాచ్ కావడం గమనార్హం. తీవ్రంగా పోరాడిన జోకోవిచ్ తన మెడికల్ డాక్టర్ తెచ్చిన పిల్స్ వేసుకున్నాడు. నాలుగవ, అయిదో సెట్స్ మధ్య అతను మెడికల్ టైమౌట్ కూడా తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో జోకోవిచ్ సుమారు 70 అనవసర తప్పిదాలు చేశాడు.
Novak Djokovic in tears as the realization dawns upon him that Father Time has finally caught up pic.twitter.com/5uOfg2Em30
— Bastien Fachan (@BastienFachan) August 31, 2026