కేపీహెచ్‌బీ కాలనీ, ఆగస్టు 26 : రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా(Hydra) పేరుతో పేద ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం తగదని, కక్షసాధింపు చర్యలతో కాకుండా..రాజకీయాలకు అతీతంగా చెరువుల(Ponds) ఆక్రమణలపై చర్యలు తీసుకుంటే పూర్తిగా సమర్ధిస్తానని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు(MLA Krishna Rao) అన్నారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని చెరువుల పరిరక్షణ కోసం చర్యలు చేపట్టడం మంచి ఆలోచన అన్నారు. గొలుసుకట్ట చెరువులు, నాళాలపై ఆక్రమణలను తొలగించి అభివృద్ధి చేయాలని కోరారు. చెరువులలో భూమి పట్టాదారులకు ఆన్యాయం చేయోద్దని, చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లను పక్కాగా గుర్తించాలని, పట్టాదారులకు టీడీఆర్ ఇచ్చి..ఆ స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని సూచించారు.
కూకట్‌పల్లిలో గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే మైసమ్మచెరువులో రాజీవ్‌గాంధీ నగర్ వెలిసిందని, అక్కడ నివసిసస్తున్న నిరుపేదలకు ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పాలన్నారు. మున్సిపల్, హెచ్ఎండీఏ అనుమతులతో నిర్మించిన భవనాలలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు, సామాన్యులు బ్యాంకులలో లోన్లు తీసుకుని ప్లాట్స్‌ను కొనుగోలు చేశారని, ఇప్పుడు ఆ ఇండ్లు చెరువులో ఉన్నాయని కూల్చివేస్త కొన్నవారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.
చెరువులను బాగు చేయాలనుకుంటే..నగరంలోని నియోజకవర్గాల వారీగా నోడల్ ఆఫీసర్లను నియమించి స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్థులను చేస్తూ ప్రజలకు ఆన్యాయం జరుగకుండా చర్యలు తీసుకోవా లన్నా రు. నియోజకవర్గంలోని బోయిన్పల్లి చెరువు పరిసరాలలో 40 ఏండ్ల క్రితం ఏర్పడిన కాలనీలో నిరుపేదలైన దళితులకు, దేవాలయానికి, శ్మశానవాటికకు నోటిసులు ఇచ్చారని ఈ చర్య సరికాదన్నారు. ఆయా ప్రాంతాల లో చెరువులు, నాలాల అభివృద్ధిలో భాగంగా గూడు కోల్పోయే పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లను కేటా యించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.