దుండిగల్, డిసెంబర్ 23: రాష్ట్రంలో పేద ప్రజలు ఆత్మగౌరవంతో బతికేలా డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించి ఇచ్చిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కే దక్కుతుందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. దుండిగల్ మున్సిపాలిటీ పరిధి డీ.పోచంపల్లిలోని డబుల్ బెడ్రూమ్ సముదాయం నుంచి సికింద్రాబాద్ వరకు నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీసీ బస్సు సర్వీస్‌ను సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు.
పేదలు ఆత్మగౌరవంతో బతకాలనే ఉద్దేశంతో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ విశాలమైన డబుల్ ఇండ్లు పేదలకు ఇచ్చారని తెలిపారు. కుత్బుల్లాపూర్ డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాల వద్ద విద్యుత్, మంచినీటి సరఫరా, భూగర్భ డ్రైనేజీ, బస్సు సదుపాయం వంటి వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం బస్తీవాసులతో కలిసి ఎమ్మెల్యే బస్సులో ప్రయాణించారు. ఈ కార్యక్రమంలో దుండిగల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పద్మారావు, కౌన్సిలర్లు శంభీపూర్ కృష్ణ, కృష్ణ యాదవ్, సాయి యాదవ్, ఆనంద్ కుమార్, బుచ్చిరెడ్డి,విష్ణువర్ధన్‌రెడ్డి, బౌరంపేట పీఏసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, గ్రంథాలయ మాజీ చైర్మన్ నాగరాజు యాదవ్, పీఏసీఎస్ డైరెక్టర్ జీతయ్య పాల్గొన్నారు.