అంబర్‌పేట, నవంబర్ 12 : నల్లకుంట డివిజన్ బాయమ్మగల్లీలో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులు నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలని అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం వివిధ విభాగాల అధికారులతో కలిసి ఎమ్మెల్యే బాయమ్మగల్లీలో పర్యటించారు. అక్కడ రూ.1.06కోట్లతో జరుగుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించారు. ఎలాంటి లోపాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా తొందరగా రోడ్డు పనులు చేయాలని సూచించారు. స్థానిక ప్రజలతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో వాటర్‌వర్క్స్ జనరల్ మేనేజర్ శ్రీధర్‌రెడ్డి, డీజీఎం విష్ణువర్ధన్‌రావు, మేనేజర్ రోహిత్, జీహెచ్ఎంసీ ఏఈ ప్రశాంత్, వర్క్ ఇన్స్పెక్టర్ నరేందర్, కాలనీ పెద్దలు పాల్గొన్నారు.