గోల్నాక, జనవరి 2 : దివాంగుల సంక్షేమానికి తన వంతు కృషి చేస్తున్నట్లు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శుక్రవారం అంబర్పేట నియోజకవర్గం దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు మంద భిక్షపతియాదవ్, నర్సింగ్ కుర్మ, టి.బాబురావు తదితరులు ఎమ్మెల్యే కాలేరును కలసి తమ సమస్యలను వివరిస్తూ వినతి పత్రం అందజేశారు.
దివ్యాంగులకు ప్రభుత్వం బీమా సౌఖర్యం వారు మ చెందితే వారికి డెత్ సర్టిఫికెట్ తో పాటు రూ.లక్షవరకు సహాయం అందించేలా ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దివ్యాంగుల అభ్యున్నతికి సహకరిస్తానని తెలిపారు. గత ప్రభుత్వం దివ్యాంగుల సంక్షేమానికి పలు పథకాలు ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు.