అంబర్‌పేట, ఆగస్టు 7 : అంబర్‌పేట నియోజకవర్గంలోని ప్రతి బస్తీ, కాలనీల్లో ఉన్న ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్(MLA Kaleru Venkatesh) అన్నారు. బాగ్ అంబర్‌పేట డివిజన్ పరిధిలోని నిత్యా ప్లేస్కూల్ లేన్‌లో రూ.16 లక్షలతో కొత్తగా నిర్మించనున్న సీసీ రోడ్డు(CC roads) పనులను డివిజన్ కార్పొరేటర్ బి.పద్మవెంకటరెడ్డితో కలిసి ఎమ్మెల్యే బుధవారం ప్రారం భించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని కాచిగూడ, నల్లకుంట, గోల్నాక, అంబర్‌పేట, బాగ్‌అంబర్‌పేట తదితర డివిజన్లలోని అన్ని బస్తీల్లో పర్యటిస్తు ప్రజల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి పైప్‌లై నిర్మాణం వంటి పనులు చేపడుతున్నామన్నారు. ప్రతి బస్తీలో ఏదో ఒక అభివృద్ధి పని చేశామన్నారు. ఈ కార్యక్రమంలో డీఈ ప్రశాంతి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, సీనియర్ నాయకులు శ్రీరాములు ముదిరాజ్, మిర్యాల రవీందర్, టి.రమేష్, అఫ్రోజ్పటేల్, కెంచె మహేష్, కోట్ల సంతోష్, ఉప్పు సుధాకర్, పి.చంద్రశేఖర్, శ్రీహరి, మిర్యాల శ్రీనివాస్, ఎన్.వెంకటరమణ, గోవిందు అశోక్, శ్రీనివాస్‌యాదవ్, లక్ష్మణ్, బాబు, దిలీప్‌రాజ్, టి.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.