గోల్నాక, ఆగస్టు 4 : అభివృద్ధిలో అంబర్ పేట నియోజకవర్గం పరుగులు పెడుతోందని స్థానిక ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. ఇందులో భాగంగా నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో ప్రజలకు అంచెలంచలుగా మౌలిక వసతులు కల్పిస్తున్నామని అన్నారు. సోమవారం అంబర్ పేట డివిజన్ లోని పలు ప్రాంతాల్లో స్థానిక కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ తో కలిసి ఎమ్మెల్యే పర్యటించారు. బాపునగర్ లో రూ.24 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేస్తోన్న వరద నీటి పైప్ లైన్ పనులను ఆయన ప్రారంభించారు.
అనంతరం చెన్నారెడ్డి నగర్ నుంచి పాదయాత్ర నిర్వహించి కొత్తగా ఏర్పాటు చేస్తోన్న సీసీ రోడ్డు పనులను ఎమ్మెల్యే పరిశీలించారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. స్థానికులను అడిగి సమస్యలు తెలుసుకున్నారు. అక్కడి నుంచి అంబర్ పేట ఎస్టీపీ వద్ద కొత్తగా ఏర్పాటు చేస్తోన్న ముస్లిం స్మశాన వాటిక నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు.
రూ.70 లక్షల అంచనా వ్యయంతో స్మశాన వాటికను మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. ఇందులో భాగంగా స్మశాన వాటికలో ప్రహరీ గోడ ఏర్పాటుతో పాటు సెంట్రల్ లైటింగ్ సిస్టం, మొక్కలు నాటి పచ్చదనం పెంపొందించి ఆహ్లాదకర వాతావరణం నెలకొల్పాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ధికారుకు సూచించారు. ఈ కార్యక్రమాల్లో జీహెచ్ఎంసీ అధికారులు శ్రీగంద్, దుర్గ తో పాటు బీఆర్ఎస్ నాయకులు జాఫర్, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.