కాచిగూడ,అక్టోబర్ 24: అంబర్పేట నియోజకవర్గ ప్రజల మౌలిక వసతుల కల్పనలో రాజీపడే ప్రసక్తే లేదని,పలు డివిజన్లలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించి ప్రణాళికా బద్దంగా అభివృద్ధి పనులను పరుగులు పెట్టిస్తున్నట్లు అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. నల్లకుంట డివిజన్ ఖార్కానలైన్లో గత కొన్ని రోజులుగా మంచినీటిలో పోల్యూషన్ వాటర్ రావడంతో ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతూ బస్తీ అధ్యక్షుడు క్యాస రవికుమార్ ఆధ్వర్యంలో ప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే కాలేరుకు శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు.
బస్తీలో నెలకొన్న పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. బస్తీ సమస్యలు త్వరలో పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అనంతరం ఎమ్మెల్యే కాలేరు మాట్లాడుతూ ప్రజల సహకారంతో ఐదేండ్లలోనే అంబర్పేట నియోజకవర్గాన్ని అభివృద్ది చేసినట్లు పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అన్ని బస్తీ, కాలనీలలో డ్రైనేజీ, మంచినీటి పైప్లైన్, రోడ్లును వేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ సాయి గణేష్ హౌస్ ఓనర్స్ వెల్ఫర్ అసోసియేషన్ ప్రతినిధులు భోగ స్వామి,పాక స్వామి, పి.రమేశ్, గొట్టాల వినోద్చారి,ఆంధ్రపు రాజు, చారి,నాగరాజు, వెంకటేశ్, పాల్గొన్నారు.