కాచిగూడ,జనవరి 23 : పేదల సంక్షేమం కోసం ప్రభత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. జమాల్బస్తీ ప్రాంతానికి చెందిన వేణు గత కొన్ని నెలలుగా ఆరోగ్యం బాగలేకపోవడంతో మెరుగైన చికిత్స నిమిత్తం దవాఖానకు వెళ్లగా ఇటీవల ఆరోగ్యం కుదుటపడింది. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బీమాగౌని కృష్ణాగౌడ్ చొరవతో శుక్రవారం వేణుకు లక్ష రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎల్ఓసీని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఎమ్మెల్యే అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా నియోజకవర్గాన్ని ఒకపక్క అభివృద్ధి, మరో పక్క సంక్షేమం రెండింటిని సమర్ధవంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేయడంలో పొరుగు రాష్ర్టాల కంటే తెలంగాణ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో భరత్, దశరథ్, సతీశ్, క్రాంతి,తదితరులు పాల్గొన్నారు.