గోల్నాక, మే 18: సీసీ కెమెరాల ఏర్పాటుకు కాలనీలు, బస్తీల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ కోరారు. ఆదివారం గోల్నాక డివిజన్ జైస్వాల్ గార్డెన్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కాలనీ ప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..సీసీ కెమెరాలు నేరాలను నిరోధిస్తాయని, కెమెరాల ద్వారా మరింత భద్రత ఏర్పడుతుందన్నారు. అంబర్ పేట నియోజకవర్గాన్ని నేర రహిత ప్రాంతంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యంగా పని చేస్తున్నామన్నారు. వాడవాడల సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలన్నారు.
డివిజన్లలో సీసీకెమెరాల ఏర్పాటుకు ముఖ్యంగా మహిళలు, యువకులు, చొరవ చూపాలన్నారు. సీసీ కెమెరాలు ఉన్న ఏరియాల్లో నేర సంఘటనలు తక్కువగా ఉంటాయని, ఒక వేళ జరిగిన వెంటనే తెలుసుకోవచ్చునన్నారు. ఒక్క సీసీ కెమెరాల వంద మంది పోలీసులతో సమానమన్నారు. సీసీ కెమెరాలు ఉన్న ఏరియాల్లో 24గంటలు ప్రజలకు రక్షణలా ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో జైస్వాల్ గార్డెన్ రెసిడెన్స్ అసోసియేషన్ ప్రతినిధులు సత్యం గౌడ్, స్వామి గౌడ్, జి.ప్రసన్నాంజనేయులు,ఏ.రామాగౌడ్ ,సి.యాదవరెడ్డి, సీహెచ్ ఇంద్రసేనా యాదవ్, డ్, పి.శ్రీహరి చారి, , జి.సురేందర్, , బి.మధుసూదనచారి, కె.అశోక్ కు మార్, కె.ఈశ్వరయ్య, పి.రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.