అంబర్పేట, ఏప్రిల్ 9: బీఆర్ఎస్ రజతోత్సవంలో భాగంగా ఈనెల 27వ తేదీన వరంగల్లో నిర్వహించనున్న బహిరంగ సభకు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. బుధవారం శివం రోడ్డులోని ఓ హోటల్లో నల్లకుంట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం డివిజన్ అధ్యక్షుడు మేడి ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భవించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఈ భారీ బహిరంగ సభకు అంబర్ పేట నియోజకవర్గం లోని ప్రతి బస్తీ, ప్రతి గల్లీ, ప్రతి కాలనీ నుంచి పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు.
పార్టీ ఆవిర్భావ వేడుకలను పురస్కరించుకొని నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో పార్టీ జెండాలను ఎగురవేయాలన్నారు. జెండా ఎగరవేసి దండీగా కదలి రావాలని పిలుపునిచ్చారు. నియోజకవర్గ మొత్తం పండగ వాతావరణం కనిపించాలని పేర్కొన్నారు. ఉదయం 8:30 కు ఫీవర్ హాస్పిటల్ చౌరస్తాలో జండా ఎగరవేసిన అనంతరం బస్తీలలో జెండా ఎగరవేయాలని సూచించారు. అందరికీ భోజనాల వసతి కూడా ఏర్పాటు చేశామని వివరించారు.
ఈ సమావేశంలో డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వి. రవీందర్రావు, భూపతినాథ్, కిషన్ రావు, విజయేంద్ర సాగర్, భాస్కర్ గౌడ్, గోనె ప్రదీప్ రావు, కూర నరేందర్, పులిజాల గెలవయ్య, ఓం ప్రకాష్ యాదవ్, ఎర్రబోలు నరసింహారెడ్డి, డివిజన్ అధ్యక్షులు సిద్ధార్థ ముదిరాజ్, చంద్రమోహన్, భీష్మ దేవ్, సాయిని మూర్తి, రమణ నాయుడు, శోభ ముదిరాజ్, ఇర్ఫాన సుల్తానా, లావణ్య, వన్నడి రమ్య, స్వప్న తదితరులు పాల్గొన్నారు.