MLA Kale Yadaiah | కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల అమలు ఎలా ఉందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎన్నో ఆశలు పెట్టుకుని కాంగ్రెస్ పార్టీని ఓట్లేసి గెలిపించుకున్న ప్రజల్లో చివరకు గ్రామాల్లో అభివృద్ధి పనులు లేకపోవడంతో నిరాశే మిగిలిపోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాంగ్రెస్ సర్కార్ పాలనలో గ్రామాల్లో రోడ్ల పరిస్థితి, అభివృద్ధి ఎలా ఉందో స్వయంగా ఆ పార్టీ ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ చెప్పకనే చెబుతున్నాయి.
ఓ కార్యక్రమంలో చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వానికి చాలా సహకారం చేస్తున్నాం కాబట్టి మా గ్రామాల్లో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. మౌళిక సదుపాయాలు కూడా కావాలి. సీతారాంపూర్, ఐతాబాద్, చందనవల్లి ప్రజలందరికి కూడా ప్లాట్లు పెండింగ్లో ఉన్నయి. మంత్రి దృష్టిలో ఉన్నాయి. మంత్రి ప్లాట్లు ఇప్పించాలని కోరారు. ఇప్పుడీ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
మా నియోజకర్గంలోని గ్రామాల్లో రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉంది
మౌలిక సదుపాయాలు కూడా లేవు
– కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య pic.twitter.com/PJ85Mxhj3K
— Telugu Scribe (@TeluguScribe) July 9, 2026