బంజారాహిల్స్,ఏప్రిల్ 28: పేదల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను నిరంతరం కొనసాగించడం ప్రభుత్వ బాధ్యత అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. బంజారాహిల్స్ రోడ్ నెం 3లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో షేక్‌పేట మండల పరిధిలోని పలు ప్రాంతాలకు చెందిన 57మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఎమ్మెల్యే దానం నాగేందర్, షేక్‌పేట తహసీల్దార్ అనితారెడ్డి చేతులమీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. పేదల కోసం ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు అందిస్తుంటాయని, వాటిని కొనసాగించి సకాలంలో అందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం పథకానికి చాలా తక్కువ సంఖ్యలో దరఖాస్తులు చేసుకోవడం బాధాకరమన్నారు. కటాఫ్ డేట్‌ను పొడిగించేలా ప్రభుత్వంతో మాట్లాడతామని, అర్హులందరూ దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సోమాజిగూడ కార్పొరేటర్ వనం సంగీతాయాదవ్, డీటీ రమేష్. మురళీ, మాజీ కార్పొరేటర్ భారతీనాయక్, మామిడి నర్సింగరావు, రాములు చౌహాన్, తదితరులు పాల్గొన్నారు.