ఎల్బీనగర్, నవంబర్ 6 : ఎల్బీనగర్ నియోజకవర్గం ఎల్లలు తెలియని నాయకులు ఎన్నికల బరిలోకి వస్తున్నారని, వారికి ఓటు ఆయుధంతో బుద్ధి చెప్పాలని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలోని చంపాపేట డిఫెన్స్ కాలనీలో కాలనీ సంక్షేమ సంఘాల,పల్లవిగార్డెన్స్లో వీరశైవ లింగాయత్‌ల ఆత్మీయ సమ్మేళనంలో ముద్దగౌని రామ్మోహన్ గౌడ్‌తో కలిసి సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ఎల్బీనగర్లో అన్ని ప్రధాన సమస్యలను పరిష్కారం చేశామన్నారు. 20 దశాబ్దాలుగా ఉన్న సమస్యలను పరిష్కరించామన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల సహకారంతో ఎల్బీనగర్లో విశ్వనగర హంగులను సమకూరుస్తున్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు గజ్జల మధుసూదన్‌రెడ్డి, కర్మన్ఘట్ హనుమాన్ దేవాలయం ఛైర్మన్ నల్ల రఘుమారెడ్డి, వీరశైల లింగాయత్ ప్రతినిధులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్కే ప్రజల మద్దతు
ఎల్బీనగర్, నవంబర్ 6 : ఎల్బీనగర్ నియోజకవర్గం ప్రజల సంపూర్ణ మద్దతు బీఆర్ఎస్ పార్టీకే ఉందని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. సోమవారం ఎల్బీనగర్ మున్సిపాలిటీ టీడీపీ మాజీ ఫ్లోర్‌లీడర్, టీడీపీ మాజీ కౌన్సిలర్ చిత్తలూరి వెంకటేశ్వర్లు తన అనుచరులతో ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ చేరారు. మాజీ కార్పొరేటర్ ముద్రబోయిన శ్రీనివాస్‌రావు, సీనియర్ నాయకుడు గజ్జల మధుసూదన్‌రెడ్డి, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పర్నె వరప్రసాద్‌రెడ్డి, కర్మన్‌ఘాట్ దేవాలయ కమిటీ ధర్మకర్త మధుసాగర్, మాజీ అధ్యక్షుడు తిలక్‌రావు, రాకేశ్, ఇంద్రాజీ, శ్రీధర్‌తో పాటు గా పార్టీలోచేరిన నాయకులు శేఖర్, బలరాం, ఆనంద్, శైలేందర్, గౌరీ శంకర్, అబ్దుల్ రహమాన్, కృష్ణారెడ్డి, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్బీనగర్, నవంబర్ 6 : ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పదకొండు డివిజన్లలో బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ నాయకులు బూత్‌ల వారీగా పార్టీ నాయకులు, శ్రేణులు ఇంటింటికీ ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.
అభివృద్ధి బాటలో ఎల్బీనగర్
చంపాపేట, నవంబర్6: ఎల్బీనగర్ నియోజకవర్గం భవిష్యత్తు తరాలకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి తానే చేశానని ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకుడు పోనుగోటి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన చంపాపేట డివిజన్ పరిధిలోని డిఫెన్స్ కాలనీ పార్కులో డిఫెన్స్‌కాలనీ, ఎస్వీకాలనీ, దుర్గానగర్ కాలనీ, మాధవనగర్ కాలనీ వాసులతో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వేమ్రెడ్డి నరసింహారెడ్డి, ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, గజ్జల మధుసూదన్‌రెడ్డి, కర్మన్‌ఘాట్ హనుమాన్ దేవాలయ చైర్మన్ నల్ల రఘుమారెడ్డితో కలిపి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నేతలు సుంకోజు కృష్ణమాచారి,బీఆర్ఎస్ ఎల్బీనగర్ యూత్వింగ్ అధ్యక్షుడు రవిముదిరాజ్, బీఆర్ఎస్ చంపాపేట డివిజన్ అధ్యక్షుడు ముడుపు రాజ్‌కుమార్‌రెడ్డి, కాలనీల అధ్యక్షులు జైపాల్‌రెడ్డి, కంచర్ల వెంకట్‌రెడ్డి, యాదగిరిరెడ్డి, వంగ జగన్నాథ్‌రెడ్డి, కర్మన్‌ఘాట్ హనుమాన్ ఆలయ ధర్మకర్తలు గోగిరెడ్డి అంజిరెడ్డి, మేక సురేందర్‌రెడ్డి, బిల్లకంటి కిరణ్‌కుమార్ గుప్త, మహిళా వింగ్ అధ్యక్షురాలు రోజారెడ్డి, నాయకులు నిషీకాంత్రెడ్డి, గౌతంరెడ్డి, గోగు శేఖర్‌రెడ్డి, చేగోని మల్లేశ్ గౌడ్, గౌర శ్రీను, పాల్గొన్నారు.
అభివృద్ధిని చూసి గెలిపించండి
హయత్‌నగర్, నవంబర్ 6 : సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ సహకారంతో ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ప్రత్యేక చొరవతో చేపట్టిన అభివృద్ధిని చూసి కారు గుర్తుకు ఓటువేసి భారీ మెజార్టీతో గెలిపించాలని హయత్‌నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్ సామ తిరుమలరెడ్డి అభ్యర్థించారు. బీఆర్ఎస్ డివిజన్ మాజీ అధ్యక్షుడు గుడాల మల్లేశ్ ముదిరాజ్, డివిజన్ జనరల్ సెక్రటరీ యానాల కృష్ణారెడ్డి, సీనియర్ నాయకులు భాస్కర్ సాగర్ పాల్గొన్నారు.
మెజార్టీయే లక్ష్యంగా పనిచేయాలి
వనస్థలిపురం, నవంబర్ 6 : బీఆర్ఎస్ పార్టీకి అధిక మెజార్టీ సాధించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పనిచేయాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి అన్నారు. బీఎన్‌రెడ్డినగర్ డివిజన్ సాహెబ్‌నగర్‌లో నీలా రాజశేఖర్‌గౌడ్ ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు.