ఉప్పల్ డిసెంబర్ 17 : ఉప్పల్ నియోజకవర్గంలోని ప్రతి డివిజన్లలో దశలవారీగా అభివృద్ధి పనులను చేపడుతున్నట్లు ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. అభివృద్ధి పనులలో భాగంగా బుధవారం మల్లాపూర్ డివిజన్ పరిధిలో రూ.కోటీ 20 లక్షల వ్యయంతో కార్పొరేటర్ పన్నాల దేవేందర్‌రెడ్డితో కలిసి ఓల్డ్ మల్లాపూర్‌లో 50 లక్షలు, బాబానగర్, గోకుల్‌నగర్ కాలనీలలో 70 లక్షల వ్యయంతో సీసీ రోడ్ల పనులకు ఎమ్మెల్యే శంకుస్ధాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతు నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలకు తావివ్వకుండా ఎప్పటి కప్పుడు సమస్యలను పరిష్కరిస్తున్నట్లు తెలిపారు.
ఎక్కడైన పెండింగ్ పనులు ఉన్నైట్లెతే తన దృష్టికి తీసుకురావాలని ఆయన కాలనీవాసులకు సూచించారు. అభివృద్ధి పనులలో నాణ్యత లోపించకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏఈ స్రవంతి, స్థానిక నాయకులు బోదాసు లక్ష్మీనారాయణ, చిగుళ్ల శ్రీనివాస్, తండా వాసుగౌడ్, కుంటి కృష్ణ, రాపోలు రాపోలు సతీస్, నెమలి రవి, పీఆర్. ప్రవీణ్, జలగం శ్రీనివాస్, నాగారం బాబు మాదిగ, దుర్గయ్య, పీరూనాయక్, ఉస్మాన్, కర్రె శంకర్, మసూద్, ఆహ్మద్, మెండ రఘు, రమణ, శంకర్‌రెడ్డి, హనుమాండ్ల విజయ్, సానల రవి, వెంకట్, భాస్కర్, రమేష్‌నాయక్, శశిధర్, తదితరులు పాల్గొన్నారు.