వైష్ణవారాధనతో ముక్తి మార్గం
శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైష్ణవ ఆలయాలు ప్రత్యేక అలంకరణలు ఉత్తర ద్వార దర్శనాలతో భక్తులకు ఆధ్యాత్మికతను అందించాయి.
- వేంకటేశ్వర ఆలయంలో పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ
- భక్తులతో పోటెత్తిన ఆలయాలు
మియాపూర్ , డిసెంబరు 23 : శేరిలింగంపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా వైకుంఠ ఏకాదశి పూజలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైష్ణవ ఆలయాలు ప్రత్యేక అలంకరణలు ఉత్తర ద్వార దర్శనాలతో భక్తులకు ఆధ్యాత్మికతను అందించాయి. వివేకానందనగర్ డివిజన్ వేంకటేశ్వర స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి ప్రత్యేక పూజాదికాలంలో కుటుంబ సభ్యులతో కలిసి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిత్తం ఉపవాసంతో వైష్ణవారాధనతో ముక్తి మార్గం లభిస్తుందని పేర్కొన్నారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం హిందువులకు ఎంతో పవిత్రమైనదని శ్రీ మహావిష్ణువును ఉత్తర ద్వార దర్శనం చేసుకోవటం అత్యంత విశిష్టమైనదని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలందరిపైనా విష్ణువు అనుగ్రహం కలగాలని ఆయన ఆకాంక్షించారు.

రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో…
మాదాపూర్, డిసెంబర్ 23: ముక్కోటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని మాదాపూర్ డివిజన్ పరిధిలోని శిల్పా పార్క్లో శనివారం శ్రీశ్రీశ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలోని స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
చందానగర్లో…
కొండాపూర్, డిసెంబర్ 23 : వైకుంఠ ఏకాదశి (ముక్కోటి) పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం చందానగర్లోని వేంకటేశ్వరస్వామి దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, మాదాపూర్ డివిజన్ కార్పొరేటర్ జగదీశ్వర్గౌడ్ పాల్గొని వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భగవంతుడి దీవెనలు ప్రజలందరిపై ఉంటాయన్నారు. నియోజకవర్గం ప్రజలు సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలంటూ భగవంతుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

