వెంగళరావునగర్, ఆగస్టు 1 : దేశంలోనే నంబర్ వన్ ముఖ్యమంత్రి కేసీఆర్ అని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ అన్నారు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం.. మెట్రో రైలు ప్రాజెక్ట్ విస్తరణకు ప్రభుత్వ ఆమోద నిర్ణయంతో ఎమ్మెల్యే మాగంటి ఆధ్వర్యంలో యూసుఫ్‌గూడ కూడలి వద్ద నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు మంగళవారం సంబురాలు చేసుకున్నారు. సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. రోడ్డుపైకి వెళ్లి ఆర్టీసీ బస్సుల డ్రైవర్లకు ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ స్వీట్లు తినిపించి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వాలు కూడా ఆర్టీసీ కార్మికులను పట్టించుకోలేదని, మోసం చేశాయని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం గొప్ప విషయమని..వారి కుటుంబాల్లో వెలుగులు నిండాయని తెలిపారు. మెట్రో రైలు ప్రాజెక్ట్ విస్తరణ కోసం రూ.69,100 కోట్లు కేటాయించం శుభ పరిణామమని అన్నారు.
మెట్రో రైలు ప్రాజెక్ట్ కోసం తమ ప్రభుత్వం 70 నుంచి 415 కిలోమీటర్లకు విస్తరించనుందని..దీంతో హైదరాబాద్ నగరం రూపురేఖలు మారనున్నాయని అన్నారు. తెలంగాణను అభివృద్ధి పథంలో సీఎం కేసీఆర్ నడిపిస్తున్నార ని..దేశంలో ఎక్కడా లేనం త అభివృద్ధి తెలంగాణలోనే జరుగుతుందన్నారు. ప్రభుత్వం చే స్తున్న అభివృద్ధి, సం క్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. కా ర్య క్రమంలో కార్పొరేటర్లు రాజ్‌కుమార్ పటేల్, దేదీప్యరావు, సీఎన్ రెడ్డి, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు సంజీవ, వేణుగోపాల్ యా దవ్, ప్రదీప్, కృష్ణమోహన్, సంతోష్, విజయ్‌కుమార్, చిన్న రమేశ్, విజయ్ సింహ, సిరాజ్, షరీఫ్, నజీర్, బ షీర్, నర్సింగ్‌దాస్, మధుయాదవ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ప్రగతి పథంలో నగరం
వెంగళరావునగర్,ఆగస్టు 1:మెట్రోరైలు ప్రాజెక్టు విస్తరణకు సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని స్వాగతిస్తూ యూసుఫ్‌గూడ కూడలిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్లు సీఎన్‌రెడ్డి, దేదీప్యరావు మాట్లాడుతూ..రద్దీగా మారుతున్న మహా నగర రవాణా వ్యవస్థను మెరుగుపర్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో హైదరాబాద్ మరింత ప్రగతి పథంలో దూసుకెళ్తుందని అన్నారు. ఇటు షాద్‌నగర్ నుంచి బీబీనగర్ వరకు మెట్రోరైలు ప్రాజెక్టు విస్తరణతో నగరం మరింతగా అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, పాల్గొన్నారు.