ఓల్డ్‌సిటీ వీధుల్లో మిస్ వరల్డ్ సుందరీమణులు హెరిటేజ్ వాక్‌లో భాగంగా చార్మినార్ వద్ద సందడి చేశారు. చార్మినార్ వద్ద ఫొటోషూట్ కు హాజరైన సుందరాంగులు, ఈ చరిత్రాత్మక వేదిక నుంచి అభివాదం చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు. చార్మినార్ సమీపంలోని ప్రసిద్ధ చుడీ బజార్ (లాడ్ బజార్)లో కంటెస్టెంట్స్ గాజులు, ముత్యాల హారాలు, ఇతర అలంకరణ వస్తువుల షాపింగ్ చేశారు. హస్తకళల పై ఆసక్తిని ప్రదర్శించారు.
అనంతరం ముద్దుగుమ్మలు చౌమహల్లా ప్యాలెస్‌కు చేరుకుని ప్యాలెస్‌లో ఉన్న నిజాం సంపద, యుద్ధ సామగ్రిని సందర్శించారు. కంటెస్టెంట్స్‌కు ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు సీఎం రేవంత్ రెడ్డి దంపతులు, మంత్రులు జూపల్లి, పొన్నం ప్రభాకర్ గౌడ్, హీరో నాగార్జున, హీరోయిన్ శ్రీలీల హాజరయ్యారు. చార్మినార్ విశిష్టతను, ఆర్కిటెక్ట్ విధానాన్ని ఇంటాక్ కన్వీనర్ అనురాధ రెడ్డి వివరించారు. – సిటీబ్యూరో, మే 13 (నమస్తే తెలంగాణ)