హైదరాబాద్: జీహెచ్ఎంసీ (GHMC) పరిధిలో ఒకే రోజు 11,700 డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) అన్నారు. శనివారం ఉదయం 11 గంటలకు లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇండ్ల (Double Bedroom House) పత్రాలను అందిస్తామన్నారు. దీనికి సంబంధించి నగరంలోని తొమ్మదిచోట్ల లాటరీ ప్రాతిపదికన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీకి ఏర్పాట్లు పూర్తిచేశామని మన్నారు. జీహెచ్ఎంసీ కార్యాలయంలో మేయర్ గద్వాల విజయ లక్ష్మితో కలిసి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గానికి 500 చొప్పున ఇండ్లను లబ్ధిదారులకు కేటాయిస్తున్నామన్నారు. లబ్ధిదారులను తీసుకొచ్చేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటుచేశామని చెప్పారు. లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. పేదలకు అన్ని సౌకర్యాలతో ఇలాంటి ఇండ్లు ఇవ్వడం గొప్ప విషయమని వెల్లడించారు. మంత్రి హరీశ్ రావుతోపాటు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, మల్లారెడ్డి, మహమూద్ అలీ, మేయర్ విజయ లక్ష్మి లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ చేస్తారని తెలిపారు.
లబ్ధిదారుల ఎంపికలో రాజకీయ జోక్యం ఉండదని స్పష్టం చేశారు. పేదలకు అన్ని సౌకర్యాలతో ఇలాంటి ఇండ్లు ఇవ్వడం గొప్ప విషయమని వెల్లడించారు. అర్హత ఉన్న ప్రతి పేద కుటుంబానికి ఇల్లు ఇస్తామన్నారు. గతంలో ఇందిరమ్మ ఇళ్లు ఎంత నాసిరకంగా కట్టారో తెలుసన్నారు. మొదటి దశలో రాలేదని బాధపడొద్దని, దశలవారీగా ఇండ్లు పంపిణీ చేస్తామన్నారు. మంత్రి హరీశ్ రావుతోపాటు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహేందర్ రెడ్డి, మల్లారెడ్డి, మహమూద్ అలీ, మేయర్ విజయ లక్ష్మి లబ్ధిదారులకు ఇండ్ల పంపిణీ చేస్తారని తెలిపారు.
సర్వేల్లో దేశంలోని ఏ రాష్ట్రంలో బీజేపీ గెలిచే అవకాశం లేదని చెప్పారు. షెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరపాలన్నారు. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు ప్రవేశపెడతారనే ప్రచారం జరుగుతున్నదని వెల్లడించారు. ఏ ఎన్నికలైనా కేసీఆర్ సర్కార్ సిద్ధంగా ఉందని, రేపు షెడ్యూల్ ఇచ్చి ఎన్నికలు పెట్టినా బరిలోకి దిగుతామని స్పష్టం చేశారు. మోదీ క్రేజ్ దేశంలో పడిపోయిందని, బీజేపీ ఓడిపోతుందనే నివేదికలు వాళ్లవద్ద ఉన్నాయని తెలిపారు. జమిలీ ఎన్నికలంటే అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలను రద్దుచేసి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. వన్ ఎలక్షన్ నినాదం మోదీ ఇప్పుడు పెట్టింది కాదని మంత్రి తలసాని అన్నారు.