బన్సీలాల్‌పేట్, అక్టోబర్ 27 : ఎన్నికల సమయంలో గద్దల్లా వాలిపోయే కాంగ్రెస్, బీజేపీలను ప్రజలు నమ్మి మోసపోవద్దని, ఎన్నికల తరువాత వారి అడ్రస్ ఉండదని సనత్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం బన్సీలాల్‌పేట్ డివిజన్లోని భోలక్‌పూర్ ప్రాంత బస్తీల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మాజీ కార్పొరేటర్ ఏసూరి సావిత్రి మహేశ్ ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్రలో ఆయనకు మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఆ రెండు పార్టీలను ప్రజలు నమ్మె పరిస్థితిలో లేరని, బీఆర్ఎస్ పార్టీ హ్యాట్రిక్ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడి నుంచి గెలిచి కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. స్థానిక బస్తీలు, సమస్యలపై అవగాహన ఉన్న తనకు మరోసారి అవకాశం ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బన్సీలాల్‌పేట్ కార్పొరేటర్ కే.హేమలత, మాజీ కార్పొరేటర్ సావిత్రి, బీఆర్ఎస్ ఇన్చార్జి జీ.పవన్‌కుమార్ గౌడ్, మహేశ్వర రావు, కే.లక్ష్మీపతి, డివిజన్ అధ్యక్షుడు వెంకటేశన్రాజు, కార్యదర్శులు ఎం.మహేందర్, రాజేందర్, నాయకులు తలసాని శంకర్ యాదవ్, ధర్మేందర్ యాదవ్, మహేశ్ యాదవ్, రవీందర్ యాదవ్, టి.శ్రీనివాస్ యాదవ్, సంతోశ్ యాదవ్, శ్రీకాంత్‌రెడ్డి, జనార్దన్, మారుతి, బాబు, శ్రీరాములు, నాగలక్ష్మి, శోభారాణి, లక్ష్మి పాల్గొన్నారు.