మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
అమీర్‌పేట్, నవంబర్ 24 : విద్యార్థులు చదువులతో పాటు క్రీడల్లోను రాణించాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. శుక్రవారం అమీర్‌పేట్‌లోని జీహెచ్ఎంసీ మైదానంలో మూడు రోజలు పాటు తలసాని యువసేన ఆధ్వర్యంలో జరుగనున్న క్రికెట్ టోర్నమెంట్‌ను సికింద్రాబాద్ పార్లమెంట్ టీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయికిరణ్ యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ.. టోర్నమెంట్లో పాల్గొనే విద్యార్థులు గెలుపోటలములను సమానంగా స్వీకరిస్తూ తమ క్రీడా స్ఫూర్తిని చాటాలని సూచించారు.
టోర్నమెంట్లో సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ కళాశాలలకు చెందిన 80 జట్లు పాల్గొంటున్నాయని, టోర్నమెంట్ విజేతకు రూ. 25వేలు, రెండో స్థానంలో నిలిచిన వారికి రూ. 15వేల నగదు బహుమతితో పాటు క్రికెట్ కిట్లను పంపిణీ చేయనున్నట్టు సాయికిరణ్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఎన్.శేషుకుమారి, డివిజన్ అధ్యక్షుడు హనుమంతరావు, టీఆర్ఎస్ నాయకులు అశోక్‌యాదవ్, ప్రవీణ్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, వనం శ్రీనివాస్, బాసా లక్ష్మి, సచిన్, లలితా గోపీలాల్ చౌహాన్ పాల్గొన్నారు.