జోన్‌బృందం, ఏప్రిల్5: బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు బాబూజగ్జీవన్‌రాం అని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మంగళవారం బాబూ జగ్జీవన్ రాం జయంతి సందర్భంగా రాంగోపాల్‌పేట్, బేగంపేట్ డివిజన్లలో ఆయన విగ్రహానికి కార్పొరేటర్ మహేశ్వరిలతో కలిసి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్పొరేటర్ చీర సుచిత్ర, మాజీ కార్పొరేటర్ అత్తెల్లి అరుణగౌడ్ తదితరులు పాల్గొన్నారు.