Minister Talasani | పోలీంగ్ శాతం పెంచడంలో యువత కీలక పాత్ర పోషించాలి : మంత్రి తలసాని
Minister Talasani | పోలీంగ్ శాతం పెంచడంలో యువత కీలక పాత్ర పోషించాలని సనత్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) పిలుపునిచ్చారు.
మారేడ్‌పల్లి (హైదరాబాద్) : పోలీంగ్ శాతం పెంచడంలో యువత కీలక పాత్ర పోషించాలని సనత్‌నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani Srinivas Yadav) పిలుపునిచ్చారు. మోండా డివిజన్లోని ఆదయ్యనగర్ క్రీడ మైదానంలో యువత ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం కల్పిస్తున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలను యువత సద్వినియోగం చేసుకోవాలని, యువత సన్మార్గంలో నడవాలని, అప్పుడే సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత లక్షలాది మంది యువతకు బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించిందని చెప్పారు. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 1. 30 లక్షల ఉద్యోగాలను టీఎస్పీఎస్సీ(TSPSC) ద్వారా భర్తీ చేసిందన్నారు.
ఐటీ మంత్రి కేటీఆర్(Minister KTR) కృషితో రాష్ట్రంలో ఆయా రంగాలు అభివృద్ధి చెందాయని తెలిపారు. 2014 లో 3 లక్షల ఉద్యోగాలు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 10 లక్షల వరకు పెరిగిందన్నారు. ఓటు అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలింగ్ శాతం పెంచడంలో యువత పాత్ర ఎంతో కీలకమైందన్నారు.
యువతకు అండగా నిలిచే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపాలని తెలిపారు. ఈ నెల 30వ తేదీన జరిగే ఎన్నికల్లో కారు గుర్తు పై ఓటు వేసి అత్యధిక మెజార్టీ తో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Srivari Temple | ఖమ్మంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి శ్రీకారం..పవిత్ర క్రతువును నిర్వహించిన త్రిదండి చిన్నజీయర్‌స్వామి
Srisailam Dam | శ్రీశైలం డ్యామ్‌కు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
Yash | సర్దార్ డైరెక్టర్‌తో యశ్ సినిమా.. క్రేజీ టాక్ నిజమయ్యేనా..?
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

