అధికారులను ఆదేశించిన మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
అమీర్‌పేట్, మార్చి 28 : రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభమయ్యే నాటికి మసీదుల వద్ద నిర్వహించే ప్రార్థనలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధికారులను ఆదేశించారు. రంజాన్ ఉపవాస దీక్షల తేదీ సమీపిస్తుండటంతో ఏర్పాట్లపై సోమవారం సనత్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని మసీదు కమిటీల ప్రతినిధులతో మాసాబ్ ట్యాంక్‌లోని మంత్రి కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో జీహెచ్ఎంసీ, విద్యుత్, జలమండలి, హార్టికల్చర్ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని పేర్కొన్నారు.
అన్ని శాఖల అధికారులు ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టిసారించి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు కొలను లక్ష్మీరెడ్డి, మహేశ్వరి శ్రీహరి, కూర్మ హేమలత, నామన శేషుకుమారి, అత్తెల్లి అరుణ గౌడ్, ఆకుల రూపతో పాటు జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, డిప్యూటీ కమిషనర్లు వంశీకృష్ణ, ముకుందరెడ్డి, జలమండలి ఈఎస్సీ కృష్ణ, సీజీఎం ప్రభు, జీవవైవిధ్య విభాగం డిప్యూటీ డైరెక్టర్ శ్రీనివాస్, శ్రీదేవి, ఎలక్ట్రికల్ డీఈలు మహేశ్‌కుమార్, సుధీర్‌కుమార్, ఏఎంవోహెచ్ ప్రవీణ్, సనత్‌నగర్ జాఫ్రీ మసీదు కమిటీ అధ్యక్షుడు సయ్యద్ సిరాజుద్దీన్, ఇతర కమిటీ ప్రతినిధులు ఫహీం, దావూద్ రషీద్, యాసీన్, నజీర్, జావేద్, అఖిల్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.