కందుకూరు, జూన్ 6 : పల్లె నిద్రలు స్థానికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి దోహదపడుతాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం రాత్రి కందుకూరు మండల పరిధిలోని దావూద్‌గూడ తండాలో మంత్రి పల్లె నిద్ర చేశారు. తండాకు వచ్చిన మంత్రికి గిరిజనులు సంప్రదాయ దుస్తులు ధరించి ఘన స్వాగతం పలికారు. గ్రామంలోని వీధి వీధిలో పర్యటించి, ఇంటింటికీ వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామం, తండాలో సెంట్రల్ లైటింగ్ సిస్టమ్ ప్రారంభంతో పాటు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎం కేసీఆర్ గిరిజన తండాలను ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసి స్వయం పాలన చేసుకోవడానికి కృషి చేశారన్నారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత మారుమూల గ్రామాలను కూడా అభివృద్ధి చేస్తుంటే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, ప్రజలు గ్రామాలకు వచ్చే ఆ నాయకులను నిలదీయాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సురుసాని వరలక్ష్మి సురేందర్ రెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ చంద్రశేఖర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు లక్ష్మి నరసింహా రెడ్డి, ఈశ్వర్ గౌడ్, రాజు, కాకి ధశరథ, గోపాల్‌రెడ్డి, సాయిలు, రామకృష్ణారెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు సురుసాని రాజశేఖర్‌రెడ్డి, మహిళా వి భాగం అధ్యక్షురాలు ఇందిరమ్మ దేవేందర్, ఆనెగౌని అంజయ్య గౌడ్, దామోదర్ గౌడ్, పాండు గౌడ్, సర్పంచ్ విజయ రాజునాయ క్, లచ్చా నాయక్, సుమన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు సామ ప్రకాశ్‌రెడ్డి, పారిజాతం, ఆనంద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మన్నె జయేందర్ టీఆర్ఎస్ యూత్ నాయకులు తాళ్ల కార్తీక్, విఘ్నేశ్వర్ రెడ్డి, బొక్క దీక్షిత్ రెడ్డి, ప్రశాంత్ చారి, రామకృష్ణ, తహసీల్దార్, విద్యుత్ ఏఈ రమేశ్‌గౌడ్, జగన్మోహన్ రెడ్డి, ప్రియాంక, వివిధ గ్రామాల టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మండల అధికారులు తెలిపారు.