బడంగ్పేట్, నవంబర్ 8 : సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధిని కార్యక్రమాలను గుర్తు పెట్టుకొని కారు గుర్తుకు ఓటెయ్యాలని మహేశ్వరం బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి సబితాఇంద్రారెడ్డి అన్నారు. బుధవారం బాలాపూర్ మండల పరిధిలోని వంగ శంకరమ్మ గార్డెన్లో బాలాపూర్ ఆర్యవైశ్య ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ఆయా చోట్ల ఆర్యవైశ్యుల ఆత్మగౌరవ భవనాలను, స్థలాలు, నిధులు ఇచ్చినట్లు తెలిపారు. జల్పల్లిలో 500 గజాలు, రూ.10లక్షలు, కందుకూర్ 100గజాలు, రూ.5లక్షలు, మహేశ్వరంలో 400గజాలు రూ.10లక్షలు, బడంగ్పేట్లో 300గజాలు రూ.10లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ఓసీలోని పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.
సీఎం కేసీఆర్ తెలంగాణ మానవీయ కోణంలో ఆలోచించి అనేక పథకాలను ప్రవేశపెట్టారని పేర్కొన్నారు. ఎన్నికల్లో ఇవ్వని వాద్ధానాలు సైతం అమలు చేశారని చెప్పారు. ఈ రాష్ర్టానికి సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామ రక్ష అని తెలిపారు. ఆర్యవైశ్యులకు రాజకీయ గుర్తింపు సీఎం కేసీఆర్ ఇస్తున్నారని తెలిపారు. ఐదు సంవత్సరాల్లో మహేశ్వరం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.
రాష్ట్రంలో కేసీఆర్‌ను మూడవ సారి సీఎం చేయడానికి కారు గుర్తుకు ఓటెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్‌గుప్తా, ఉప్పల శ్రీనివాస్‌గుప్తా, మేయర్ దుర్గా దీప్లాల్, డిప్యూటీ మేయర్ తీగల విక్రంరెడ్డి, కార్పొరేటర్ నవీన్‌గౌడ్, పల్లె జంగయ్య, తెరటిపల్లి శ్రీనివాస్‌గుప్తా, ఉప్పల వెంకటేశ్ గుప్తా, అమరవాది లక్ష్మీనారాయణగుప్తా తదితరులు పాల్గొన్నారు.