మహేశ్వరం/పహాడీషరీఫ్/ఆర్కేపురం, జూలై 25: బీఆర్ఎస్ పార్టీకి నియోజకవర్గంలో తిరుగులేని ఆదరణ లభిస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దానప్పగారి యాదగిరి, స్వర్ణగంటి కిషన్ మంగళవారం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కరోళ్ల చంద్రయ్య ముదిరాజ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆనందం, నాయకులు నవీన్, మినాజ్పటేల్, కాకికుమార్ ఆధ్వర్యంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రోజురోజుకూ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందని అన్నారు. సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్‌గా నిలుస్తుందని అన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరికలు జరుగుతున్నాయని అన్నారు. పార్టీలో చేరిన ప్రతి ఒక్కరికీ సముచిత స్థానం లభిస్తుందని.. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కరోళ్ల రాములు, శ్రీను, బహదూర్‌గూడ మహేందర్, స్వర్ణగంటి సంజీవ, పెల కుమార్, ఏపూరి రాజు తదితరులు పాల్గొన్నారు.
జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో వరదనీటి సమస్యల శాశ్వత పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మున్సిపాలిటీ పరిధి 3వ వార్డులోని నబిల్ కాలనీలో వరదనీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్న మంత్రి సబితా ఇంద్రారెడ్డి జోరు వానలో చైర్మన్ అబ్దుల్లా సాది, కమిషనర్ వసంత, మున్సిపల్ అధికారులతో కలిసి పర్యటించారు. నబిల్ కాలనీలో ఎగువ ప్రాంతాల నుంచి వచ్చిన వరదతో కాలనీలో నీరు చేరిన ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులకు వరద సమస్య లేకుండా చూడాలని పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు అహ్మద్ కసాది, జాఫర్బామ్, సయ్యద్ యాహియా, డీఈ వెంకన్న, ఏఈ ఆయేషా, బీఆర్ఎస్ నాయకుడు ఖైసర్బామ్ కాలనీ వాసులు పాల్గొన్నారు.
సరూర్‌నగర్ డివిజన్లో పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే చెపట్టాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు. మంగళవారం మంత్రి కార్యాలయంలో ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ పంకజ, వివిధ శాఖల అధికారులతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భగత్‌సింగ్‌నగర్, బాపునగర్‌లో మహిళా భవన్, అంబేద్కర్‌నగర్‌లో సీసీ రోడ్లు, లక్ష్మీనగర్ కాలనీ, ఎస్బీఐ కాలనీలో మంజూరైన పార్కు, విజయపురి కాలనీలో నాలా పనులు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాంట్రాక్టర్లకు ఏవైనా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకొస్తే కమిషనర్‌తో మాట్లాడి పరిష్కరిస్తానని తెలిపారు. మంజూరైన పనుల పట్ల అధికారులు అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. భగత్‌సింగ్‌నగర్, అంబేద్కర్‌నగర్‌లో 58,59 జీవో కింద దరఖాస్తు చేసుకున్న ప్రజలకు ఇబ్బందులు లేకుండా రెగ్యులరైజేషన్ చేయాలని తాసీల్దార్‌కు సూచించారు. సరూర్‌నగర్ జూనియర్ కళాశాలలో చేపడుతున్న అదనపు గదుల బిల్డింగ్ పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. ప్రజలకు సంక్షేమం, అభివృద్ధి అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు అశోక్‌రెడ్డి, శ్రీనివాస్, విజయ్ కుమార్, ప్రసాద్‌రావు, దేవేందర్, బీఆర్ఎస్ నాయకులు బేర బాలకిషన్, లోకసాని కొండల్‌రెడ్డి, ఇంటూరి అంకిరెడ్డి, ధర్పల్లి అశోక్, సుదర్శన్ ముదిరాజ్ తదితరులు ఉన్నారు.
కులవృత్తుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మంగళవారం అమీర్‌పేట్ గ్రామానికి చెందిన గౌడ సంఘం సభ్యులు సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలకు, మతాలకు సముచిత స్థానం కల్పించడం జరుగుతుందని అన్నారు. అమీర్‌పేట్ గ్రామ గౌడ సంఘం నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బస్వ శ్రీశైలం గౌడ్, ఉపసర్పంచ్ పోతుల నర్సింగ్ పటేల్, ఎంపీటీసీ కుమారి రాయప్ప, గౌడ సంఘం అధ్యక్షుడు బస్వ యాదయ్య గౌడ్, డైరెక్టర్ దేవవరం గౌడ్, నాయకులు వెంకటేశ్‌గౌడ్, అవుల అశోక్‌గౌడ్, ప్రభాకర్‌గౌడ్, అంజయ్య గౌడ్, వర్కల అంజయ్య గౌడ్, బీమయ్యగౌడ్, సత్తయ్యగౌడ్, రమేశ్‌గౌడ్, దర్శన్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.