ఆర్కేపురం, జూన్ 11: ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనలతో గ్రేటర్ హైదరాబాద్ ‘ప్రపంచ స్థాయి నగరం’గా మారుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అన్నారు. ఆదివారం సరూర్‌నగర్ లక్ష్మినగర్ కాలనీలో రూ.32 లక్షలతో నిర్మించే పార్కు నిర్మాణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఈ ప్రాంతం ఎట్లుండెదో, ఇప్పుడు ఎల్లా మారిందో ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఎల్బీనగర్ చౌరస్తాలో నూతనంగా నిర్మితమైన ైప్లె ఓవర్లు, అండర్ పాస్‌లతో ఈ ప్రాంత రూపురేఖలే మారిపోయాయన్నారు.
నూతనంగా నిర్మించనున్న మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రితో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న నగరంలో పార్కలతో ఆహ్లాదకరమైన వాతావరణం లభిస్తుందన్నారు. స్వచ్ఛమైన గాలి, కాలుష్య రహితంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కృషి చేస్తోందని, ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటాలని మంత్రి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రతి ఏటా హరితహారం చేపడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ పదేళ్ల పండుగలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీతో మంత్రి సబితాఇంద్రారెడ్డికి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ దయానంద్‌గుప్తా, మాజీ కార్పొరేటర్ పారుపల్లి అనితాదయాకర్‌రెడ్డి, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శిలు మురుకుంట్ల అరవింద్‌శర్మ, బేర బాలకిషన్, నియోజకవర్గ యూత్వింగ్ మాజీ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, ఆర్కేపురం డివిజన్ అధ్యక్షుడు నగేశ్, సరూర్‌నగర్ డివిజన్ అధ్యక్షుడు మహేందర్‌యాదవ్, ముద్ద పవన్ తదితరులు పాల్గొన్నారు.