బంజారాహిల్స్/బన్సీలాల్‌పేట్/బేగంపేట్/అమీర్‌పేట్/ఖైరతాబాద్/హిమాయత్‌నగర్, డిసెంబర్ 28: ‘మీకు రేషన్ కార్డు ఉందా.. ఆధార్ కార్డులో అడ్రస్ ఇక్కడే ఉందా.. రేషన్ కార్డు లేకుంటే స్కీమ్స్ రావు.. రేషన్ కార్డు కోసం తెల్లకాగితంలో రాసివ్వండి.. ఒక కుటుంబంలో ఒకటే స్కీమ్ వస్తుంది” అంటూ ‘ప్రజాపాలన’ కార్యక్రమంలో దరఖాస్తులు చేసుకునేందుకు వచ్చిన వారికి అధికారులు చుక్కలు చూపించారు. దరఖాస్తులు ఎలా నింపాలో.. రేషన్ కార్డుల కోసం ఎవర్ని అడగాలో తెలియక జనం ఆయోమయానికి గురయ్యా రు. ఇదీ మొదటిరోజు ప్రజాపాలన పరిస్థితి.