‘గ్రేటర్ హైదరాబాద్‌లో రహదారుల నిర్వహణ అధ్వానంగా ఉంది? ఎక్కడ చూసినా.. గుంతల రోడ్లే దర్శనమిస్తున్నాయి? అధికారులు ఏం చేస్తున్నట్లు? మెరుగైన రహదారులే లక్ష్యంగా పనిచేయండి? హైదరాబాద్‌లో వాయు కాలుష్యం నానాటికీ పెరుగుతూ గాలి నాణ్యత క్షీణిస్తున్నది? జీహెచ్ఎంసీ వాయు నాణ్యతను కాపాడడంలో ప్రధాన బాధ్యత తీసుకోవాలం’టూ జీహెచ్ఎంసీ అధికారుల పనితీరుపై హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
– సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ)
సిటీబ్యూరో, జనవరి 21 (నమస్తే తెలంగాణ): నగరంలో హెచ్ సిటీ ప్రాజెక్టుల్లో జాప్యం జరగవద్దని, పనులను వేగవంతం చేయాలన్నారు. ఫిబ్రవరి 10తో ప్రస్తుత జీహెచ్ఎంసీ పాలకమండలి గడువు ముగియనున్న నేపథ్యంలో మంగళవారం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఆయన ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహించారు. మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వీ కర్ణన్‌తో కలిసి అధికారులకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.
నగరంలో గాలి నాణ్యతను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి అధికారులకు సూచించారు. కాలుష్యానికి ప్రధాన కారణమైన పాత వాహనాన్ని నిఘా ఉంచాలని, ఫిట్నెస్ లేని వాహనాలపై కఠినంగా వ్యహరించాలన్నారు. ప్రకృతిని కాపాడుకునేందుకు ప్రాధాన్యత నివ్వాలని మంత్రి అదికారులకు సూచించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఇంకుడు గుంతల నిర్మాణ అంశంలో కఠినంగా వ్యవహరించాలని, ఇంటి నిర్మాణ సమయంలోనే ఇంకుడు గుంతలను తప్పనిసరిగా నిర్మించుకునేలా చూడాలని మంత్రి సూచించారు. విద్యుద్దీపాల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, పూర్తి స్థాయిలో వెలిగేలా చూడాలన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణపైనే హైదరాబాద్ స్వచ్ఛ బ్రాండ్ ఇమేజ్ ఆధారపడి ఉందని చెప్పారు. స్వచ్ఛత కార్యక్రమాలు క్రమం తప్పకుండా ప్రభావంతంగా నిర్వహించేలా చూడాలని ఆదేశించారు. బస్తీ దవాఖాన, ఇందిరమ్మ క్యాంటీన్లు సజావుగా నిర్వహించేలా పర్యవేక్షణ చేయాలని చెప్పారు.

అభివృద్ధి పనులపై ఆరా..
ఈ సమావేశంలో కేవలం పాలనాపరమైన అంశాలే కాకుండా, నగరంలో జరుగుతున్న ఎస్ఆర్డీపీ, హెచ్ సిటీ, ఎన్ఎన్డీపీ తదితర అభివృద్ధి పనులపైనా మంత్రి పొన్నం ప్రభాకర్ సుదీర్ఘంగా ప్రతిష్టాత్మక హెచ్-సిటీ, ఎస్ఆర్డీపీ, ఎన్ఎస్డీపీ నాలా పనుల పురోగతిని సమీక్షించారు. పనులు ఏ దశలో ఉన్నాయి? ఎకడెకడ జాప్యం జరుగుతోంది? అనే విషయాలపై అదనపు కమిషనర్లు, ఇంజినీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనుల్లో వేగం పెంచాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు పకడ్బందీ కార్యాచరణతో ముందుకు సాగాలన్నారు.
ఫిబ్రవరి 10న విభజనపై క్లారిటీ
బల్దియా విభజనపై వచ్చే నెల ఫిబ్రవరి 10న ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయాన్ని వెల్లడిస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. విభజన విషయంలో ఎలాంటి సందేహాలు అవసరం లేదని, ప్రభుత్వం పకా ప్రణాళికతో ఉందని స్పష్టం చేశారు. ప్రస్తుత పాలక వర్గం పదవి కాలం మరో 20 రోజుల్లో ముగియనుండడంతో అధికారులపై మరింత బాధ్యత పెరగనుందన్నారు. నిత్యం అప్రమత్తంగా ఉంటూ పబ్లిక్ గ్రీవెన్స్ పరిష్కారానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
ఇకపై మీదే బాధ్యత..
హైదరాబాద్ మహానగరాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 12 జోన్లు, 60 సరిళ్లు, 300 డివిజన్లుగా విభజించిన నేపథ్యంలో.. ఆయా జోనల్ కమిషనర్లు, సరిల్ అధికారులను, వివిధ విభాగాల ఉన్నతాధికారులు మరింత బాధ్యతగా పనిచేయాలన్నారు. పాలకమండలి గడువు ముగిసిన తర్వాత ప్రజా సమస్యలను పరిషరించే బాధ్యత పూర్తిగా అధికారుల భుజసంధాలపైనే ఉంటుందని తేల్చిచెప్పారు. ప్రజాప్రతినిధులు లేని సమయంలో ప్రజల నుంచి ఒత్తిడి పెరుగుతుందని, పారిశుధ్యం, విద్యుత్, తాగునీరు వంటి అంశాలపై ప్రశ్నించేవాళ్లు ఎకువ అవుతారని హెచ్చరించారు. ప్రజల ప్రశ్నలకు, సమస్యలకు బదులు ఇచ్చేందుకు, వాటిని సత్వరమే పరిషరించేందుకు అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు.
జోనల్ స్థాయిలో అధికారులతో సమన్వయం చేసుకుంటూ, వారిచేత పని చేయించే బాధ్యత కమిషనర్ దేనని మంత్రి స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీలో పనిచేస్తున్న అధికారులంతా కేవలం ఉద్యోగ బాధ్యతగానే కాకుండా, సామాజిక బాధ్యతతో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఐదేండ్ల తమ పాలకవర్గంలో సహకరించిన ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు, అధికారులు, నగర ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఆనంతరం 22 మందికి మంత్రి పొన్నం, మేయర్ కారుణ్య నియామక పత్రాలను అందజేశారు. గ్రేటర్లో స్వచ్ఛత కార్యక్రమాలు మరింత ప్రభావంతంగా జరిగేందుకు పర్యవేక్షణ బాధ్యతలను మెడికల్ అధికారుల నుంచి ఇంజినీర్లకు అప్పగించినట్లు కమిషనర్ ఆర్ వీ కర్ణన్ తెలిపారు.
హెచ్ సిటీ, ఎస్ఆర్డీపీ, డీ సిల్టింగ్ పనులను టైమ్ బాండ్‌తో పూర్తి చేస్తామన్నారు. గ్రేటర్లో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులను దశల వారీగా పెంచుతున్నట్లు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థను మరింతగా మెరుగుపరిచేందుకు ఎంఎంటీఎస్ స్టేషన్, మెట్రో స్టేషన్లకు బస్ కనెక్టివిటీ పెంచాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమీక్షా సమావేశంలో డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి, అదనపు కమిషనర్లు సృజన, వినయ్ కృష్ణారెడ్డి, అనురాగ్ జయంతి, హేమంత్ కేశవ్ పాటిల్, జోనల్ కమిషనర్లు, డిప్యూటీ కమిషనర్లు, వివిధ విభాగాల అధిపతులు పాల్గొన్నారు