మేడ్చల్/మేడ్చల్ కలెక్టరేట్, అక్టోబర్ 29: ‘కాంగ్రెస్ నమ్మితే తెలంగాణ ఆగం అవుతుందని, ఐదు గంటల కరెంటే వస్తుందని, రైతుబంధు, రైతుబీమా, దళితబంధు లాంటి పథకాలు బంద్ అయితయి’ అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ప్రజా ఆశీర్వాద సభ పేరుతో ఆదివారం మేడ్చల్ ఆయన రోడ్డు షో నిర్వహించారు. అనంతరం దమ్మాయిగూడలో రోడ్డు షో నిర్వహించి రాజీగృహ కల్పన కాలనీల్లో ఏర్పాటు చేసి బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ ఎన్నికలు వచ్చాయని కాంగ్రెస్, బీఆర్ఎస్లో ఎన్నెన్నో ప్రగల్బాలు పలుకుతున్నాయన్నారు. వాటిని నమ్మితే గోస పడక తప్పదన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణను తొమ్మిదిన్నరేళ్లలో సీఎం కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ఇంటింటికీ తాగునీరు, 24 గంటల కరెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, బీసీ బంధు, ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీముబాకర్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలను కేసీఆర్ అమలు చేశారని తెలిపారు. ఏదో ఒక పథకం కింద ప్రతి ఇల్లు లబ్ధి పొందిందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో కరువే తాండవించందని,అభివృద్ధి, సంక్షేమం కొనసాగాలంటే మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావాలనారు.
అధికారంలో ఉన్నప్పుడు చేయలేదని, ఇప్పుడు చేస్తామంటే ఎవరూ నమ్ముతారన్నారు. కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ఆ పథకాలను ఎందుకు అమలు చేయడం లేదన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినట్టు తెలంగాణ వస్తుందని కాంగ్రెస్ నాయకులు కలలు కంటున్నారని, అది ఎప్పటికీ సాధ్యం కాదన్నారు. మేడ్చల్ ప్రజల ఓట్లతో ఎంపీగా గెలిచిన రేవంత్ రెడ్డి ప్రజలకు ఒక్కసారి ముఖం చూపిన పాపాన పోలేదన్నారు. కానీ పీసీసీ పదవి కొనుక్కొని, ఎమ్మెల్యే టిక్కెట్లు అమ్ముకుని బాగుపడ్డాడని ఆరోపించారు. మేడ్చల్ కాంగ్రెస్ అభ్యర్థి జంగయ్య యాదవ్ కబ్జాకోరు అని మంత్రి ఆరోపించారు. భూ కబ్జాలతో బాగా డబ్బులు రాగానే తన పేరు వజ్రేష్ యాదవ్‌గా పేరు మార్చుకున్నారన్నారు. ఆయన ఎవరో కూడా మెజార్టీ ప్రజలకు తెలియదని ఆయన ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికల్లో జంగయ్య యాదవ్ ఘోర పరాజయం కావడం ఖాయమన్నారు. ప్రజల మద్దతు హ్యాట్రిక్ సాధిస్తానని చెప్పారు. దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని భవానీనగర్‌లో నివసిస్తున్న పేద ప్రజలకు ఇండ్ల పట్టాలిచ్చామని, రోడ్లు వేయించామని, మురుగునీళ్ల దుర్వాసనను కూడా తొలగించనున్నామని మంత్రి చెప్పారు. లింకు రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, పనులు ప్రారంభం కానున్నాయన్నారు.
జవహర్‌నగర్‌ను అద్దంలా తయారు చేశామని చెప్పారు. సీనియర్ సిటిజన్ అసోసియేషన్‌ను దత్తత తీసుకొని, సమస్యల పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.అసోసియేషన్ భవనాన్ని నిర్మించి ఇస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మున్సిపాలిటీ చైర్పర్సన్ మర్రి దీపికా నర్సింహారెడ్డి, వైస్ రమేశ్, నియోజకవర్గ ఇన్చార్జి మహేందర్ రెడ్డి, మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, బీఆర్ఎస్ మండల, మున్సిపాలిటీ అధ్యక్షులు దయానంద్ యాదవ్, శేఖర్ గౌడ్, రైతుబంధు సమితి అధ్యక్షుడు నందారెడ్డి, వైస్ ఎంపీపీ వెంకటేశ్, నాయకులు శ్రీనివాస్ రెడ్డి, నర్సింహా రెడ్డి, జగన్ రెడ్డి, రాజమల్లారెడ్డి, విష్ణుచారి, సత్యనారాయణ, కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దమ్మాగూడలో జరిగిన కార్యక్రమంలో దమ్మాయిగూడ, నాగారం మున్సిపాలిటీ చైర్పర్సన్లు ప్రణీతాశ్రీకాంత్ గౌడ్, చంద్రారెడ్డి, వైస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దయాకర్ రెడ్డి, మున్సిపాలిటీ అధ్యక్షులు తిరుపతిరెడ్డి, శ్రీధర్, ప్రధాన కార్యదర్శి హరిగౌడ్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. సభ అనంతరం దమ్మాయిగూడలో పలు కాలనీకి చెందిన ప్రజలకు మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
అభివృద్ధి ప్రధాత మంత్రి మల్లారెడ్డి
ఘట్కేసర్ రూరల్, అక్టోబర్ 29: అభివృద్ధే లక్ష్యంగా పని చేసి ప్రజల మన్ననలను పొందిన మంత్రి మల్లారెడ్డి గెలుపును ఎవరూ ఆపలేరని మండల బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి అన్నారు. మండల పరిధి అవుషాపూర్‌లో ఆదివారం విలేకరుల మాట్లాడుతూ ఘట్కేసర్ మండలంలో తన సొంత నిధులు కోట్ల రూపా యలు కేటాయించి అభివృద్ధి పనులు చేపట్టిన ఘనత మంత్రి మల్లారెడ్డికి దక్కిందన్నారు. ప్యాకేజీల కోసం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన నాయకులకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.
మంత్రి మల్లారెడ్డి విజయం ఖాయం
కీసర, అక్టోబర్ 29: ఎన్నికల్లో మంత్రి చామకూర మల్లారెడ్డి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని బీఆర్ఎస్ మండల అధ్యక్షులు జలాల్పురం సుధాకర్‌రెడ్డి అన్నారు. కీసరలోని పలు బూత్ ల్లో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలతో కలిసి మంత్రి మల్లారెడ్డికి మద్దతుగా ప్రచారం చేశారు.కార్యక్రమం లో నాయకులు వెంకటేశ్ ముదిరాజ్, భానుశర్మ, శ్రీధర్‌రెడ్డి, బాల్‌రాజ్, శ్రీనివాస్, సుమన్ బన్ని, రాజుగౌడ్, ప్రవీన్ పాల్గొన్నారు.
ముమ్మరంగా బీఆర్ఎస్ ప్రచారం
ఘట్కేసర్,అక్టోబర్29: మంత్రి మల్లారెడ్డికి మద్దతుగా ఆదివారం ఘట్కేసర్,పోచారం మున్సిపాలిటీ నారపల్లి 16వ వార్డులో బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు మందాడి సురేందర్ రెడ్డి,ఘట్కేసర్ మున్సిపాలిటీ వార్డుల్లో చైర్పర్సన్ ముల్లి పావనీ జంగయ్య యాదవ్ ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు.
అభివృద్ధిని చూసి బీఆర్ఎస్కు ఓటేయండి
మేడ్చల్ కలెక్టరేట్, అక్టోబర్ 29: రాష్ట్రంలో అమలు చేసిన పథకాలు, చేసిన అభివృద్ధిని చూసి బీఆర్ఎస్కు ఓటేసి మంత్రి మల్లారెడ్డిని గెలిపించాలని బీఆర్ఎస్ యువ నేత చామకూర భద్రారెడ్డి ప్రజలను కోరారు. ఆదివారం నాగారం మున్సిపాలిటీ పరిధిలోని 12, 16,17వ వార్డులలోని పలు కాలనీల్లో చైర్మన్ కౌకుం ట్ల చంద్రారెడ్డితో కలిసి భద్రారెడ్డి ఇంటింటికీప్రచారం నిర్వహించారు. మ్యానిఫెస్టో పత్రాలను అందజేసి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరా రు. ఈ కార్యక్రమంలో పార్టీ అధ్యక్షలు శ్రీధర్, వర్కిం గ్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, వైస్ చైర్మన్ మల్లేష్, నాయకులు ఆంజనేయులు గౌడ్(అంజన్న), అనంత్ రెడ్డి, సాయినాథ్‌గౌడ్, దయాకర్‌రావు, శ్రీనివాస్, సురేశ్, జలాల్ పాషా, శ్రీకాంత్, రెడ్యానాయక్ ,రాహుల్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.