సిటీబ్యూరో, నవంబర్ 9 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్లో ఎన్నికల సెగ రాజుకుంటోంది. బీఆర్ఎస్ పార్టీ మినహా విపక్ష పార్టీల అభ్యర్థులెవరో? అన్నది సస్పెన్స్ కొనసాగింది. నేటితో నామినేషన్ల ఘట్టం ముగింపు చేరడంతో చివరి దశలో కొన్ని పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. మొత్తంగా ప్రధాన పార్టీల నుంచి బరిలో నిలిచే అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. దీంతో ఏయే నియోజకవర్గంలో ఎలాంటి పోటీ జరగనుందో దాదాపు స్పష్టమైంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రక్రియలో ముఖ్యమైన నామినేషన్ల దాఖలు ఘ ట్టం శుక్రవారంతో ముగియనుంది. దీంతో ప్రచారంపై ప్రధాన పార్టీలు సీరియస్గా తీసుకుంటున్నాయి. తమ పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేపట్టడానికి రాజకీయ ప్రముఖులంతా రంగంలోకి దిగుతున్నారు. దాదాపు 20 రోజుల పాటు జరిగే ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలు పేలనున్నాయి.
సవాల్-ప్రతి సవాళ్లతో హోరెత్తనుంది. గల్లీలు, కాలనీల్లో ర్యాలీలు, సభలు, సమావేశాలు, పాదయాత్రలతో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకోనున్నారు. రెండు నెలలుగా నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనతో హోరెత్తించిన టీఆర్ఎస్ అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ముం దుంది. ఎక్కడ అసంతృప్తుల బెడద లేకుండా మెజార్టీ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా క్యాంపెయిన్ చేస్తూ వచ్చారు. గ్రేటర్ ప్రచార బాధ్యతలు తీసుకున్న మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఆత్మీయ సమావేశాలు, పార్టీ బూత్ కమిటీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని శ్రేణులంతా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసేలా దిశా నిర్దేశం చేశారు. క్యాడర్లో మరిం త నయా జోష్ ఉండేలా ఈ నెల 15వ తేదీ నుం చి 22వ తేదీ వరకు 15 నియోజకవర్గాల్లో అభ్యర్థుల తరపున రోడ్ షో నిర్వహించనున్నారు. అగ్ర ప్రచారం ముగింపు సందర్భంగా 25న సీఎం కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించనున్నారు.
ఇంటింటీ ప్రచారం, పాదయాత్రలు ఒకవైపు మరోవైపు కలిసివచ్చే నేతలను పార్టీలోకి ఆహ్వానిస్తూ నియోజకవర్గ ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులు దూసుకుపోతున్నారు. నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలతో క్యాడర్లో నూతనోత్తేజాన్ని నింపుతూ అందరినీ ఒక్క తాటిపైకి తీసుకువచ్చి అభ్యర్థుల గెలుపునకు ఇన్ఛార్జిలు, పార్టీ ముఖ్యులు, మంత్రులు బాటలు సుగమమం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పదేండ్ల అ భివృద్ధి, ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో ప్రచార అస్త్రంగా కాలనీలు, బస్తీ లు కలియతిరుగుతూ ప్రజలను ఆకట్టుకుంటున్నారు.
కాంగ్రెస్, బీజేపీలు 65 ఏండ్లు పాలించిన అభివృద్ధి జరగలేదని, గడిచిన పదేండ్లలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం వందేండ్ల అభివృద్ధికి బాటలు వేసిందంటూ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తున్నా రు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ప్రచారంలో అన్ని పార్టీల కంటే ముందున్న బీఆర్ఎస్ ప్రత్యర్థి పార్టీ ల డిపాజిట్లను గల్లంతు చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పావులు కదుపుతున్నదన్నారు. ప్రతి వం ద ఓటర్లకు ఒక ఇన్చార్జీని నియమించి నియోజకవర్గంలో ప్రతి ఓటరును కలుస్తున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థులంతా భారీ మెజార్టీతో గెలుపొందే లా ఎప్పటికప్పుడు ప్రచారం నిర్వహిస్తున్నారు.