సికింద్రాబాద్ పరిధిలోని తుకారం గేట్ జోగి నగర్‌కు చెందిన అనీషా తన గోడును మంత్రి కేటీఆర్‌కు ట్విట్టర్ వేదికగా వినిపించింది. తాను ప్రేమ వివాహం చేసుకున్నాను. తన భర్త కొవిడ్‌తో మరణించాడు. తనకు ఐదు, రెండేండ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్త చనిపోయిన తర్వాత తమను బంధువులు ఎవరూ కూడా దగ్గరకు రానివ్వడం లేదు. కనీసం సాయం కూడా చేయడం లేదు. రూమ్ రెంట్ కట్టేందుకు కూడా డబ్బుల్లేవు. నిన్నటి నుంచి పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. మీరే ఏమైనా సహాయం చేయాలని ట్విట్టర్ ద్వారా కేటీఆర్‌ను ఆమె అభ్యర్థించారు.
అనీషా ట్వీట్‌కు మంత్రి కేటీఆర్ తక్షణమే స్పందించారు. వుమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ అధికారులకు అనీషా ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ.. వీలైనంత త్వరగా ఆ కుటుంబానికి సహాయం చేయాలని కేటీఆర్ ఆదేశించారు.
కేటీఆర్ ట్వీట్‌పై మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. స్థానిక అంగన్వాడీ టీచర్‌ను అప్రమత్తం చేశారు. అయితే అనీషా కుటుంబానికి తక్షణ సాయం అందించామని మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు. ఆకలితో అలమటిస్తున్న ఆ ఇద్దరు పిల్లలకు అంగన్వాడీ టీచర్ తన ఇంట్లోనే ఫుడ్‌ను ప్రిపేర్ చేసి తీసుకెళ్లి వడ్డించిందని అధికారులు పేర్కొన్నారు. అనీషా కుటుంబానికి అండగా ఉంటామని అధికారులు స్పష్టం చేశారు.
My compliments to the Anganeadi teacher 👏 Thanks for your assistance to the family https://t.co/QEeWBrlaLu
— KTR (@KTRTRS) February 11, 2022