సికింద్రాబాద్లో జరిగిన అగ్నిప్రమాదంపై రాష్ట్ర మంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.3 లక్షల నష్టపరిహారం అందజేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఇక్కడి రూబీ లాడ్జి సెల్లార్లో ఎలక్ట్రిక్ షోరూంలో పేలుడు కారణంగా మంటలు అంటుకున్న సంగతి తెలిసిందే.
ఆ సమయంలో లాడ్జిలో మొత్తం 25 మంది ఉన్నారు. వారిలో ఇప్పటికే 8 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంతకుముందే ఈ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల నష్టపరిహారం ప్రకటించారు.