సిటీబ్యూరో, జనవరి 7(నమస్తే తెలంగాణ) : సంక్రాంతి పండుగ సంబురాలను(Sankranthi celebrations) అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు హైదరాబాద్ మెట్రో(Metro train) సన్నాహాలు చేస్తోంది. రేపటి నుంచి(8,9,10) మూడు రోజుల పాటు మీటైం ఆన్ మై మెట్రో క్యాంపెన్ పేరిట వేడుకలను నిర్వహిస్తున్నది. పండుగ సంబురాలను ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్లో ప్రారంభించనున్నారు. వేడుకల్లో భాగంగా తెలుగుదనం ఉట్టిపడేలా సాంస్కృతిక కార్యక్రమాలు, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా కార్యక్రమాలు, తెలుగు ఔన్నత్యాన్ని చాటేలా వేడుకలను నిర్వహించేందుకు ఎల్ అండ్ టీ ఏర్పాట్లు చేసింది. నగరంలోని పలు స్టేషన్ల పరిధిలో ఈ వేడుకలను ఉండేలా ఏర్పాటు చేయనున్నారు.
ఇవి కూడా చదవండి..
Bajireddy Govardhan | పగలు కాంగ్రెస్తో.. రాత్రి బీజేపీతో రేవంత్ అనుబంధం : బాజిరెడ్డి గోవర్ధన్
Cold Wave | తెలంగాణలో కొనసాగుతోన్న చలి.. రాబోయే ఐదు రోజులు జర జాగ్రత్త..!