Metro Rail | హైదరాబాద్ : పెంచిన మెట్రో చార్జీలు రద్దు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఎల్ అండ్ టీ దిగొచ్చింది. పెంచిన మెట్రో ఛార్జీలలో 10 శాతం రాయితీ కల్పిస్తూ ఎల్ అండ్ టీ నిర్ణయం తీసుకుంది. ఈ రాయితీలు మే 24వ తేదీ నుంచి వర్తించనున్నాయి.
మెట్రో రైలు కనీస ఛార్జీ రూ. 10 నుంచి రూ. 12కు, గరిష్ఠ ఛార్జీ రూ. 60 నుంచి రూ. 75కు పెంచిన విషయం విదితమే. పెరిగిన మెట్రో ఛార్జీలు ఈ నెల 17 నుంచి అమల్లోకి వచ్చాయి. మెట్రో ఛార్జీలు పెంచడంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఇటీవల పెరిగిన మెట్రో ఛార్జీలు ఇలా..
మొదటి 2 కి.మీ. వరకు రూ. 12
2 నుంచి 4 కి.మీ. వరకు రూ. 18
4 నుంచి 6 కి.మీ. వరకు రూ. 30
6 నుంచి 9 కి.మీ. వరకు రూ. 40
9 నుంచి 12 కి.మీ. వరకు రూ. 50
12 నుంచి 15 కి.మీ. వరకు రూ. 55
15 నుంచి 18 కి.మీ. వరకు రూ. 60
18 నుంచి 21 కి.మీ. వరకు రూ. 66
21 నుంచి 24 కి.మీ. వరకు రూ. 70
24 కి.మీ. నుంచి ఆపై దూరానికి రూ. 75