సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కృష్ణకాంత్ పార్కులో జీహెచ్ఎంసీ కార్మికులు, ఉద్యోగులు, పొదుపు సంఘాల సభ్యులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో కలిసి హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి పొన్నం వైద్య శిబిరంలో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. అనంతరం కార్మికులకు హెల్త్ కిట్స్ పంపిణీ చేశారు. 30 ఏరియాల్లో ఈ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి తదితరులు పాల్గొన్నారు.