Meat Shops | హైదరాబాద్ : భారత జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి నేపథ్యంలో రేపు(జనవరి 30) హైదరాబాద్ నగరంలో మాంసం దుకాణాలను మూసివేయాలని జీహెచ్ఎంసీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మేక, గొర్రెల మండిలు, దుకాణాలు మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జీహెచ్ఎంసీ చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ఎంసీ కమిషనర్ హెచ్చరించారు. పోలీసులు కూడా నిఘా ఉంచాలన్నారు. మాంసం దుకాణాలు తెరిచిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | కరెంట్ బిల్లు అడిగినందుకు బూతులు తిడుతూ లైన్మెన్పై దాడి
Hyderabad | గచ్చిబౌలిలో వ్యభిచార గృహంపై పోలీసులు దాడి.. 9 మంది అరెస్ట్