GHMC | సిటీబ్యూరో: మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన గురువారం జరిగిన 7వ స్టాండింగ్ కమిటీ సమావేశం హాట్ హాట్‌గా జరిగింది. మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీ సభ్యులు కమిషనర్, అధికారుల తీరుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కమిషనర్ ఇలంబర్తి పనితీరుపై మేయర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. స్టాండింగ్ కమిటీ సభ్యుల విజ్ఞప్తి మేరకు డివిజన్లలో క్షేత్రస్థాయిలో మేయర్ పర్యటిస్తుంటే కమిషనర్ హాజరు కాకపోవడం ఏంటని ప్రశ్నించారు. కమిషనర్ నుంచి అధికారులు క్షేత్రస్థాయిలో తిరుగుతుంటేనే సరైన ప్రతిపాదనలు వస్తాయని మేయర్ హితవు పలికారు.
బీఆర్ఎస్, ఎంఐఎం సభ్యులు సైతం కమిషనర్ వ్యవహార శైలిని తప్పుపట్టారు. ఈ సందర్భంగా వీధి దీపాల నిర్వహణపై సభ్యులంతా అసంతృప్తిని వ్యక్తం చేశారు. గడిచిన ఆరు నెలలుగా వీధి దీపాల నిర్వహణ బాగలేదని, ఎన్నిసార్లు చెప్పినా.. అధికారులు మాట వినడం లేదని కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. ఆనంతరం స్టాండింగ్ కమిటీలో తొలి మూడు అంశాల్లో భాగంగా కేబీఆర్ పార్కు చుట్టూ హెచ్ సిటీ ప్రాజెక్టు కింద ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణానికిగానూ మూడు జంక్షన్లలో 105 ఆస్తులకు సంబంధించి కమిటీలో చర్చ పెట్టారు. దీనిపై బీఆర్ఎస్ పార్టీ సభ్యులు ఆర్డీపీ ప్లాన్‌పై స్పష్టత లేదని అభ్యంతరం వ్యక్తం చేశారు. ఎవరి ఆస్తులు ఎక్కడెక్కడ పోతున్నాయి? వారి వివరాలు సభ్యులు తెలియపర్చాలని డిమాండ్ చేశారు. ప్రముఖుల నివాసాలు, ఆస్తులకు సంబంధించి గోప్యత ఎందుకు పాటిస్తున్నారని, తొలుత వారి ఆస్తులను స్వాధీనం చేసుకున్నాకే మిగతా వారి జోలికి వెళ్లాలని, భూ సేకరణ లోపభూయిష్టంగా ఉందని ఆరోపించారు. దీంతో కేబీఆర్ పార్కు ఫ్లై ఓవర్ ఆస్తుల సేకరణ ఆర్డీపీ ప్లాన్‌ను కమిటీ ఆమోదించలేదు.
స్టాండింగ్ కమిటీలో ఆమోదించిన అంశాలివీ..