Hyderabad | గోషామహల్లో భారీ చోరీ.. 30 తులాల బంగారం, 5 లక్షల నగదు అపహరణ
Hyderabad | హైదరాబాద్‌లోని గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. జైన్ స్కూల్ సమీపంలో తాళం వేసిన ఓ ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు.
Hyderabad | హైదరాబాద్‌లోని గోషామహల్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. జైన్ స్కూల్ సమీపంలో తాళం వేసిన ఓ ఇంట్లోకి చొరబడి బంగారం, వెండి ఆభరణాలు, నగదును ఎత్తుకెళ్లారు.
బాధిత కుటుంబం ఆదివారం ఉదయం పెళ్లికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం పగులగొట్టి ఉండటం గుర్తించాడు. అనుమానంతో ఇంట్లోకి వెళ్లి తనిఖీ చేయగా సుమారు 30 తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.5 లక్షల నగదు చోరీకి గురైనట్లు తెలిసింది. వెంటనే బాధితుడు గోషామహల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించారు. పరిసర ప్రాంతాల సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగల కోసం గాలింపు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

