అమీర్‌పేట్, అక్టోబర్ 17: ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చి విస్మరించిన కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్‌రెడ్డి ఓటర్లకు పిలపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోసీనాథ్కు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్, సీనియర్ నాయకులు రాగిడి లక్ష్మారెడ్డిలతో కలిసి ఎర్రగడ్డలోని రాజీవ్‌నగర్, నందానగర్, వెంకటేశ్వరకాలనీ, కళ్యాణ్‌నగర్, ఎర్రగడ్డ, గోకుల్ థియేటర్ పరిసరాల్లో నిర్వహించిన ఇంటింటికీ వెళ్లి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా పద్మా దేవేందర్‌గౌడ్ మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్ల పేరుతో బీసీలను వంచించిన కాంగ్రెస్‌కు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పరాజయం తప్పదన్నారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. ఈ ప్రచారంలో మెట్టుగూడ కార్పొరేటర్ సునీత, కూకట్పల్లి కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణ, బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ సతీమణి అయేషా షకీల్, ఎర్రగడ్డ బీఆర్ఎస్ కంటెస్టెడ్ కార్పొరేటర్ కంజర్ల పల్లవి యాదవ్‌తో పాటు పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు.
అల్వాల్ అక్టోంబర్17: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్ గెలుపు కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపఠం కావాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు.శుక్రవారం ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డి ఎస్బీహెచ్ కాలనీలో విస్త్రతంగా ప్రచారం చేస్తూ ఓ చోట బట్టలు ఇస్త్రీ చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మురుగేష్,బీఆర్ఎస్ నాయకులు బద్దం పరుశురాం రెడ్డి,సంపత్ యాదవ్,వెంకటేష్,ఉమాపతి,లక్ష్మి,ఆనంద్,అనిత,అరుణ్‌కుమార్,తిరుపతి తదితరులు పాల్గొన్నారు.