శంషాబాద్ : శంషాబాద్(Shamshabad) పోలీస్ స్టేషన్ పరిధిలో హ్యాష్ రుపంలో ఉన్న గంజాయిని(Marijuana) పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలోని ఉట్పల్లి శ్రీ కృష్ణ హాస్పిటల్ వద్ద ఇద్దరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద హ్యాష్ రూపంలో ఉన్న గాంజాయిని విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గంజాయిని విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Congress | అంబర్నాథ్లో 12 మంది కాంగ్రెస్ కౌన్సిలర్లపై వేటు.. బీజేపీలో చేరిన కౌన్సిలర్లు
Pregnant Women | గర్భిణీలు ఈ ఆహారాన్ని తింటే ప్రమాదం.. పుట్టబోయే బిడ్డకు ఈ సమస్యలు వస్తాయి..