మైలార్‌దేవ్‌పల్లి, జనవరి 15 : పతంగులను చేసేందుకు వెళ్తే ఓ వ్యక్తి ప్రాణాలు పోయాయి. బిల్డింగ్‌పై నుంచి ప్రమాదవశాత్తు కిందపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మార్కండేయనగర్ ప్రాంతానికి చెందిన మాధవరావు(55) తాపీ మేస్త్రీ. ఈ నెల 14వ తేదీన సంక్రాంతి పండుగ సందర్భంగా బిల్డింగ్‌పై కుటుంబ సభ్యులు పతంగులు(Kites) ఎగరవేస్తున్నారు.
దీనిని చూడడానికి మాధవరావు బిల్డింగ్‌పైకి ఎక్కాడు. ప్రమాదవశాత్తు 4వ అంతస్తు నుంచి కిందపడిపోయాడు. ఈ ఘటనలో మాధవరావుకు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
Armoor | ఆర్మూర్‌లో బీజేపీ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు
Chinese manja | విషాదం..ఇద్దరి మెడను కోసేసిన చైనా మాంజా.. హాస్పిటల్‌కు తరలింపు
Harish rao | ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని కోతలు విధించకుండా అమలు చేయాలి : హరీశ్ రావు