Mailardevpally | మైలార్‌దేవ్‌పల్లి, ఫిబ్రవరి 5 : అధికారుల నిర్లక్ష్యానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ కార్పొరేటర్ తోకల శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. డివిజన్ పరిధిలోని బుద్వేల్ రైల్వే స్టేషన్ ప్రాంతంలో స్థానికుల ఫిర్యాదు మేరకు ఆయన బుధవారం జలమండలి, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటించారు. రోడ్ల దుస్థితి, డ్రైనేజీ వ్యవస్థ తదితర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు ఆయన దృష్టికి తేవడంతో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు కనీస అవసరాలు కల్పించే విషయంలో అధికారులు శ్రద్ధ చూపడం లేదన్నారు. ప్రతి రోజు తనకు డ్రైనేజీ, రోడ్ల సమస్యలపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పెడచెవిన పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలు అంటే ఇంత నిర్లక్ష్య వైఖరి పనికి రాదన్నారు. వీలైనంత త్వరగా డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించడంతో పాటు గుంతలమయమైన రోడ్ల సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజా సమస్యల శాశ్వత పరిష్కారమే ధ్యేయంగా అహర్నిశలు పని చేయాలన్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన తన దృష్టికి తేవాలన్నారు.
ఈ పర్యటనలో జలమండలి అధికారులు రేణుక, వినయ్, జీహెచ్ఎంసీ ఏఈ నర్సింహ్మమూర్తి, వర్క్ ఇన్స్పెక్టర్ రాహుల్, నాయకులు జోగి రవి, శ్రీకాంత్‌రెడ్డి, ప్రభుదాస్, పరుషోత్తం, రాకేష్, శ్రీకాంత్‌రెడ్డి, పాండుయాదవ్, ఏ.శంకర్, మాలతీ, ప్రసాద్, సిద్ధప్ప, రాజు, రఘురెడ్డి, బస్తీ వాసులు తదితరులు పాల్గొన్నారు.