కేపీహెచ్బీ కాలనీ: కేపీహెచ్బీ కాలనీలో భూముల వేలం పాటలో వచ్చిన సొమ్ములో కొంతైనా కూకట్పల్లి నియోజకవర్గం అభివృద్ధికి కేటాయించాలని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం హౌసింగ్ బోర్డ్ స్థలాల అమ్మకాలపై ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హౌసింగ్ బోర్డు భూములను కాపాడామన్నారు. కాలనీలు, బస్తీల్లో హౌసింగ్ బోర్డు ఖాళీ స్థలాలను ప్రజలకు ఉపయోగపడే పార్కులుగా క్రీడా ప్రాంగణాలుగా తీర్చిదిద్దామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే హౌసింగ్ బోర్డు స్థలాలను అమ్మకానికి పెట్టిందని, ప్రజలకు చెందిన స్థలాలను అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నదని విమర్శించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలోనే హౌసింగ్ బోర్డు స్థలాలను అమ్ముకొని రూ.3 వేల కోట్లను సేకరించారని… నేడు మళ్లీ అదే పందాలో భూములను అమ్ముతున్నదన్నారు. బీఆర్ఎస్ పార్టీ కాపాడితే… కాంగ్రెస్ పార్టీ అమ్ముకోవడం బాధాకరమన్నారు.