కేపీహెచ్‌బీ కాలనీ, మే 9: పాకిస్థాన్‌పై భారతదేశం చేస్తున్న ధర్మ యుద్ధంలో గెలవాలని, ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు (Madhavaram Krishna Rao) ఆకాంక్షించారు. శుక్రవారం కూకట్పల్లి రామాలయంలో ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావాలని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఉగ్రవాదాన్ని పోషిస్తూ భారతదేశంలోని అమాయక ప్రజలను పొట్టన పెట్టుకుంటున్న పాకిస్థాన్‌కు తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
భారత ప్రభుత్వం చేస్తున్న ఈ దాడికి ప్రతి ఒక్కరూ మద్దతు తెలపాలని, రాజకీయాలకతీతంగా ప్రజలు సంఘటితంగా… సైనికుల్ల పనిచేయాలని పిలుపునిచ్చారు. దేశ రక్షణ కోసం పోరాడుతున్న సైనికులకు మద్దతు ఇవ్వాలని, దేశానికి అండగా నిలబడాలని పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూరులో భారత్ విజయం సాధించడం ఖాయమని, ఈ ధర్మ పోరాటానికి దేవుడు అండగా ఉండాలని కోరుకుంటూ పూజలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు మాధవరం రంగారావు, తూము శ్రావణ్ కుమార్, పగడాల బాబురావు, ఆలయ కమిటీ చైర్మన్ తులసిరావు తదితరులు ఉన్నారు.