కందుకూరు, ఏప్రిల్ 10 : బీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుంచి బీజేపీ నాయకులకు భయం పట్టుకుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని దన్నారం గ్రామానికి చెందిన దాదాపుగా 100 మందికి పైగా బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మంత్రి సబితాఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌తోపాటు ఆయన కుటుంబంపై విషం కక్కడమే ప్రధాన ఎజెండాగా బీజేపీ నాయకులు పని చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశమంతా ప్రధాన మంత్రి అమలు చేసి అప్పుడు మాట్లాడాలని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మన్నె జయేందర్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, డైరెక్టర్ పిట్టల పాండు ముదిరాజ్, పీఏసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, ఉప సర్పంచ్ పాపమ్మ, నర్సింహ, రమేశ్, మల్లేశ్, కరుణాకర్, పార్టీలో చేరిన వారిలో పిట్టల బాల్‌రాజ్, పరమేశ్, రాములు, యాదయ్య. జంగయ్య, శ్రీనివాస్, రాఘవేందర్ తదితరులు ఉన్నారు.