మన్సూరాబాద్, ఫిబ్రవరి 3: ప్రపం చ క్యాన్సర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం సాయంత్రం ఎల్బీనగర్ కామినేని దవాఖాన ఆధ్వర్యంలో నాగోల్, రాక్‌టౌన్ కాలనీలోని జీడీ గోయెంకా పాఠశాల ప్రాంగణంలో 200 డ్రోన్లతో లేజర్ షో నిర్వహించా రు. డ్రోన్ షో ద్వార క్యాన్సర్‌ను త్వరగా గుర్తించడం, వెంటనే చికిత్స చేయించుకోవడం లాంటి అంశాలపై విద్యార్థుల తోపాటు వారి తల్లిదండ్రులు, కార్యక్రమానికి హాజరై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ షోను దాదాపు 2వేల మంది వీక్షించారు.
కామినేని దవాఖాన సీఓఓ గాయత్రి కామినేని, సీనియర్ సర్జికల్ ఆంకాల జిస్టులు డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ జి.అవినాష్ రెడ్డిలు హాజరై మాట్లాడుతూ.. క్యాన్సర్‌ను మొదటి దశలోనే గుర్తించినట్లయితే వ్యాధిని నయం చేయవచ్చునని తెలిపారు. డాక్టర్ హ ర్షసూరి, డాక్టర్ ఎస్. జయంతి, డాక్టర్ ఎం.శ్రీనివాస్, డాక్టర్ వెంకటసింహా, డాక్టర్ కిరణ్‌కుమార్ అన్నంరాజు, డాక్టర్ స్రవంత్ కమ్మట, జీడీ గోయెం కాపాఠశాల డైరెక్టర్ ని వేదిత శివకుమార్, ప్రిన్సిపాల్ జగదీశ్వరి నటరాజ్, రిషి దాస్తాని పాల్గొన్నారు.